America Winter Olympics: 2022, బీజింగ్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అథ్లెట్లు మాత్రం ఒలింపిక్స్‌లో పాల్గొంటారని, కానీ ప్రభుత్వ అధికారులను తాము పంపబోమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. బీజింగ్‌లో జరగనున్న పారాలింపిక్ గేమ్స్‌కూ ఇదే విధానం వర్తిస్తుందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే దేశాలతో తాము వ్యాపారాలు, సంబంధాలు పెట్టుకోమన్న సందేశాన్ని పంపేందుకే శీతాకాల ఒలిపింక్స్‌ను రద్దు చేసినట్లు సాకి వివరించారు.
బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు నవంబర్లోనే బైడెన్ చెప్పారు. అదే నెలలో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన వర్చువల్ భేటీలోనూ ఒలింపిక్స్ విషయం చర్చలోకి రాలేదు.
చైనా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని.. ముఖ్యంగా దేశంలో మైనారిటీ ముస్లింలుగా ఉన్నా ఉయ్ఘర్లను చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో అమెరికా ప్రభుత్వం 2022 శీతాకాల ఒలింపిక్స్‌ను నిషేధించింది.
ఇదీ చూడండి: హాంకాంగ్‌లో చైనా మరో చట్టం.. ఈసారి మీడియా, ఇంటర్నెట్పై!