ETV Bharat / international

భారత నౌకాశ్రయంపై సైబర్‌దాడి యత్నాల్లో చైనా!

author img

By

Published : Mar 4, 2021, 6:06 AM IST

భారత్​పై చైనా యుద్ధాన్ని మరో రూపంలో కొనసాగిస్తోంది. దేశంలో ఉండే నౌకాశ్రయాల లక్ష్యంగా చేసుకుని సైబర్ యుద్ధానికి తెర లేపినట్లు అమెరికాలోని రికార్డెడ్​ ఫ్యూచర్​ అనే ప్రయివేటు సంస్థ తెలిపింది.

america reported that China in cyber-attack attempts on Indian ports
భారత నౌకాశ్రయంపై సైబర్‌దాడి యత్నాల్లో చైనా!

భారత్‌పై చైనా సైబర్‌ యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. కంప్యూటర్లను హ్యాక్‌ చేయడం ద్వారా గతంలో ముంబయిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించగా, ప్రస్తుతం ఓ నౌకాశ్రయంపై దృష్టి పెట్టింది. అమెరికాకు చెందిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అనే ప్రయివేటు సైబర్‌ భద్రత సంస్థ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే 'రెడ్‌ ఎకో' హ్యాకర్లు ఇంకా చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ స్టూవర్ట్‌ సాల్మన్‌ వెల్లడించారు. చైనా హ్యాకర్లు, ఒక భారత నౌకాశ్రయం మధ్య ఇప్పటికీ సమాచారం నడుస్తోందని చెప్పారు. ఈ వ్యవహారం 'హ్యాండ్‌ షేక్‌' మాదిరిగా ఉందని తెలిపారు.

రెండు నౌకాశ్రయాలు సహా, పది సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు ఫిబ్రవరి పదో తేదీన గుర్తించామని చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి కూడా కొన్ని సంస్థల్లోకి సమాచారం వెళ్తుండడాన్ని గమనించామని తెలిపారు. ఇప్పటికి కూడా ఓ నౌకాశ్రయం వెబ్‌సైట్‌ నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారని చెప్పారు. భారత సరిహద్దుల్లో ఘర్షణకు దిగిననాటి నుంచే కీలక రంగాలపై సైబర్‌ దాడులు చేయడంపై చైనా దృష్టి పెట్టింది. అయితే దీనిని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ బుధవారం ఖండించారు.

టీకా తయారీ సంస్థలను హ్యాక్‌ చేయలేదు: చైనా
కరోనా టీకా తయారీ సంస్థలైన భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్ల సైట్లను హ్యాక్‌ చేసినట్టు వచ్చిన వార్తలను కూడా చైనా ఖండించింది. తాము అలాంటి పనులకు పాల్పడలేదని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.