అలిసన్ రెన్యూ.. 'ఎక్స్‌ప్లోర్ మార్స్'లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. 2019లో వాషింగ్టన్‌లో 'హ్యూమన్ టూ మార్స్' సమ్మిట్ నిర్వహణ బాధ్యత ఈమే చూసుకుంది. అఫ్గానిస్థాన్ రోబో టీమ్ నుంచి అయిదుగురు అమ్మాయిలు దీనికి హాజరయ్యారు. వాళ్లంతా 16- 18 ఏళ్లలోపు వాళ్లే. అలిసన్ 11 మంది సంతానంలో 9 మంది అమ్మాయిలే. దీంతో ఆ అఫ్గాన్(Afghanista news) అమ్మాయిలతో సులువుగా కలిసిపోయింది. తర్వాత వారితో అనుబంధాన్ని కొనసాగించింది. ఓరోజు ఆ అమ్మాయిలు 'తాలిబన్లు మా నగరంలోకి వచ్చేశారు. ఇక మేం బతికుంటామో లేదో కూడా చెప్పలేం' అన్నారు. ఆ మాటలు అలిసన్‌ను భయపెట్టాయి. దేశంలోని అధికారులను కలిసింది. ప్రయోజనం లేక పోయింది. దీంతో ఖతార్‌కు వెళ్లింది.
రెండు వారాల కష్టం ఫలించి..
ఖతార్ ఎంబసీలో అలిసన్ స్నేహితురాలు పని చేస్తోంది. ఆమెను సాయమడిగింది. విద్యార్థుల పాస్‌పోర్టులు, అవసరమైన పత్రాలను అందించింది. అప్పటికే తాలిబన్లు(Afghanistan Taliban) ఏర్‌పోర్ట్‌కు వెళుతున్న వారిని అడ్డుకుంటున్నారు. కానీ యూఎస్ ప్రతినిధుల సాయంతో వారంతా విమానాశ్రయానికి చేరుకోగలిగారు. అలా అలిసన్ రెండు వారాల కష్టం ఫలించి పదిమంది అమ్మాయిలు దోహా చేరుకున్నారు.
"ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ వాళ్లని బయటకు తీసుకు రాలేననిపించింది. అందుకే ప్రయత్నించా. మా కష్టం ఫలించి వాళ్లు తప్పించుకున్నారు. ఇదంతా చేపట్టే ముందు ఇన్‌స్టాలో అందరి ప్రార్థనలూ కోరాను. అంతకు ముందు ఇలాంటివాటిపై నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఇదంతా ఓ అద్భుతంలా అనిపిస్తోంది. వాళ్లంతా సురక్షితంగా విమానమెక్కారని తెలియగానే కన్నీళ్లు ఆపుకోలేక పోయాను. ఇక ఈ అమ్మాయిలు వాళ్లకి నచ్చిన చదువులను వాళ్లు నిర్భయంగా కొనసాగించవచ్చు. అమ్మాయిల రోబో టీమ్‌లో మిగిలిన ఇంకో 25 మందినీ కాపాడే ప్రయత్నంలో ఉన్నా."
-అలిసన్ రెన్యూ , 'హ్యూమన్ టూ మార్స్' సమ్మిట్ నిర్వాహకురాలు
తాలిబన్ల ఉక్కు పిడికిలి నుంచి అమ్మాయిలను రక్షించిన అలిసన్ నిజంగా ఓ సూపర్ వున్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అలిసన్ మోటివేషనల్ స్పీకర్, రచయిత, ఈక్వెస్ట్రెయిన్, పైలట్, జిమ్నాస్టిక్ కోచ్ కూడా.
ఇదీ చూడండి: Afghan Taliban: 'స్వేచ్ఛను కోల్పోయాం.. మళ్లీ మేం బందీలైపోయాం'
ఇదీ చూడండి: Taliban news: అఫ్గాన్‌లో కో- ఎడ్యుకేషన్ బంద్!