చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్‌ను నిషేధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఆ జాబితాలోకి ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబాతో పాటు మరిన్ని చైనా సంస్థలు చేరే అవకాశముందని సూచనాప్రాయంగా వెల్లడించారు.
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌ను నిషేధిస్తూ ఇప్పటికే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థకు నష్టం అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు.
గత కొంత కాలంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్, ప్రపంచంపై చైనా ఆధిపత్య ధోరణి అంశాల్లో అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది.
ఇదీ చూడండి:- ట్రంప్ డెడ్‌లైన్: టిక్‌టాక్ ఆస్తులను 90 రోజుల్లోపు..