బ్రెజిల్ అమెజాన్ వర్షారణ్య ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జారీ ఉపనదిలో పడవ బోల్తా పడి 18 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
జారీ నదిలో ప్రయాణికులు పడవ మీద వెళ్తుండగా శనివారం ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు సోమవారానికి 18 మృతదేహాలను గుర్తించారు. ఇప్పటి వరకు 46 మందిని రక్షించారు.
హెలికాప్టర్ల, విమానాలు, గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు బ్రెజిలియన్ నావికాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:జనాభా లెక్కల్లో కొత్త చిక్కు