అగ్రరాజ్యంలో తుపాకీ కాల్పుల మోత ఆగడం లేదు. ఓర్లీన్స్ నగరంలోని ప్రఖ్యాత పర్యటక ప్రాంతం ఫ్రెంచ్ క్వార్టర్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఓ సమూహంపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3 గంటలకు ఘటన జరిగింది. సమూహంలో దాడికి పాల్పడింది ఎవరో స్థానికులు గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేసినట్టు వివరించారు.
ఇదీ చూడండి: నడిరోడ్డుపై 'భూతాల' పరుగులు- జనం నవ్వులు