ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం- ఒకరు మృతి - కేబినెట్​ బిజినెస్​లో కాల్పులు

అమెరికా టెక్సాస్​లో మరోసారి కాల్పుల మోత మోగింది. గురువారం బ్రియాన్​లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

texas shooting
అమెరికాలో మరోసారి కాల్పులు- ఒకరు మృతి
author img

By

Published : Apr 9, 2021, 5:42 AM IST

Updated : Apr 9, 2021, 7:03 AM IST

అమెరికా టెక్సాస్​లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్రియాన్​లోని ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అయితే.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు బ్రియాన్ పోలీసులు తెలిపారు. దుండగుడు కాల్పులు ఎందుకు జరిపాడనేదానిపై స్పష్టత లేదని అన్నారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఓ పోలీసు అధికారికి బుల్లెట్ తగిలినట్లు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు.

నిందితుడు ఘటన జరిగిన కెంట్ మోర్ సంస్థలోనే పనిచేసే వాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఉద్యోగులను కూడా ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రఫేల్​ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో

Last Updated : Apr 9, 2021, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.