ETV Bharat / entertainment

Wake Up Team Salaar : 'సలార్'​ టీమ్​పై ఫ్యాన్స్ ఫైర్​.. ఫస్ట్​ సింగిల్ కోసం​ డిమాండ్..​ - సలార్ మూవీ ట్రైలర్ అప్డేట్

Wake Up Team Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సలార్'. శ్రుతి హాసన్​, పృథ్వీరాజ్​ సుకుమారన్​ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబర్​లో విడుదల కానుంది. అయితే ఈ రిలీజ్​ డేట్​ దగ్గర పడుతున్న కొద్ది సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్​లు లేకపోవడం వల్ల అభిమానులు కంగారు పడుతున్నారు. ట్విట్టర్​ వేదికగా పలు హ్యాష్​ట్యాగ్​లు క్రియేట్ చేసి ట్రెండ్​ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 15, 2023, 1:37 PM IST

Updated : Aug 15, 2023, 2:08 PM IST

Wake Up Team Salaar : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'ఆదిపురుష్​'తో ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఆయన.. త్వరలో 'సలార్'​గా ఆడియెన్స్​ను అలరించనున్నారు. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి' తర్వాత ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడకపోవడం వల్ల ఆయన సాలిడ్​ కమ్​బ్యాక్​ కోసం రెబల్​ ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తన అప్​కమింగ్ మూవీస్​​ 'సలార్', 'కల్కి 2898 ఏడీ' పైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు.

Salaar First Single Update : ఇక 'సలార్'​ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. సెప్టెంబర్​లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్​ ఎప్పుడో చెప్పేశారు. అయితే​​ విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్​ ఎటువంటి అప్డేట్​ ఇవ్వకపోవడం వల్ల అభిమానుల్లో ఆందోళన మొదలవుతోంది. ఈ క్రమంలో సోషల్​ మీడియా వేదికగా ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. #WakeUpTeamSalaar.. Release Salaar First Single అనే హ్యాష్​ ట్యాగ్​లను ట్విట్టర్ వేదికగా ట్రెండ్​ చేస్తూ ఫస్ట్​ సింగిల్​ కోసం డిమాండ్​ చేస్తున్నారు.

Salaar Trailer News : గతంలో టీజర్ విడుదల చేసిన సమయంలోనే ఆగస్టులో ట్రైలర్ రిలీజ్ చేస్తామంటూ ఓ అప్డేట్​ ఇచ్చారు మేకర్స్. కానీ ఇప్పటికే ఆగస్టు మొదలై రెండు వారాలు అయిపోయాయి. అయినా కూడా 'సలార్' టీం మాత్రం సైలెంట్​గానే ఉందంటూ నెట్టింట డార్లింగ్ ఫ్యాన్స్​ ఫైర్​ అవుతున్నారు. మరో వైపు స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా సాంగ్ అప్డేట్ ఉంటుందని అంటున్నప్పటికీ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. దీంతో ఈ ట్రెండ్​ చూస్తే అయినా మూవీ టీమ్ ఏదైనా అప్డేట్​ ఇస్తుందేమో అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Salaar Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్'లో శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు, టీను ఆనంద్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది.

Salaar Break RRR Record : రిలీజ్​కు ముందే RRR రికార్డ్​ బ్రేక్​.. ఇంటర్వెల్​ సీన్​ వేరే లెవల్​!

Salaar Prabhas : ఇంటర్నేషనల్​ మాఫియాతో ప్రభాస్​​ బిగ్​ ఫైట్​.. ఫ్యాన్స్​కు పూనకాలే!

Last Updated : Aug 15, 2023, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.