ETV Bharat / entertainment

Tollywood Tier 2 Heroes : ఈ హీరోల డిమాండ్​ రూ.100కోట్లు! - నాని సినిమాల బిజినెస్​

Tollywood Tier 2 Heroes Movie Bussiness : ప్రస్తుతం టాలీవుడ్​ ఇండస్ట్రీలో టైర్​ 2 హీరోల మార్కెట్ బిజినెస్​ పరిధి బాగా పెరిగింది. ఆ వివరాలు..

Tollywood Tier 2 Heroes : పెరుగుతున్న టైర్-2 హీరోల డిమాండ్​.. అందరూ రూ.100కోట్లే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 7:26 PM IST

Tollywood Tier 2 Heroes Movie Bussiness : చిత్రపరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి పెరిగిపోయింది. గత రెండు మూడేళ్ల క్రితం వరకు ఓ సినిమా రూ.100 బిజినెస్ చేసిందంటే అదో గొప్ప విషయం. ఒకట్రెండు స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే ఇది సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడలా లేదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

పాన్​ ఇండియా ట్రెండ్ వచ్చాక.. టైర్ 2 హీరోలు కూడా తమ సినిమాలతో దాదాపుగా రూ.100 కోట్లకు చేరువగా బిజినెస్​ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రతీ సినిమా.. పాన్ ఇండియా లెవల్​లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా చిత్రాలు పలు భాషల్లో డబ్బింగ్​ అవుతున్నాయి. దీంతో ఓ సినిమమా ఓవరాల్​ బిజినెస్​ భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్​ విషయంలో భారీ డీల్స్ జరుగుతున్నాయి.

ఈ మధ్యే.. విజయ్​ దేవరకొండ-సమంత ఖుషి సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర బిజినెస్​​ భారీగానే జరిగిందని అన్నారు! నాని సినిమాలు కూడా ఇతర భాషల్లో రిలీజ్ అవుతూ పర్వాలేదనిపించే వసూళ్లను నమోదు చేస్తున్నాయి. నాన్​ థియేట్రికల్​ రైట్స్​ కూడా మంచి ధరకే విక్రయాలు జరుగుతున్నాయి. దసరాతో ఆయన మార్కెట్ పరిధి పెరిగింది. దీంతో ఆయన కొత్త సినిమా హాయ్ నాన్న నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ రేటుకు అయిందని తెలిసింది. రూ.100కోట్ల వరకు వచ్చే అవకాశముందనే టాక్ కూడా వినిపిస్తోంది.

రామ్​పోతినేని స్కంద చిత్రంతో పాన్ ఇండియా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ చిత్రం బిజినెస్​ దాదాపు రూ.150కోట్ల వరకు జరిగి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్​, డిజిటల్ రైట్స్​, థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి ఇంత మొత్తం జరిగిందని అంటున్నారు. రామ్ నటిస్తున్న మరో చిత్రం డబుల్ ఇస్మార్ట్ కూడా పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కుతోంది. తొలి భాగానికి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుంది.

రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా రూ.100కోట్ల వరకు బిజినెస్ చేసుకుందట. నాగచైతన్య చందు మొందేటి పాన్ ఇండియా చిత్రం కూడా రూ.100కోట్ల వరకు వ్యాపారం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా మార్కెట్​లో అడుగుపెట్టిన నిఖిల్ కొత్త సినిమాలు భారీ బిజినెస్​లు చేస్తాయని అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Movie Director With No Flops : ప్ర‌తి సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్‌.. ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడు ఎవరంటే?

Kollywood Heroes Red Card : ఆ స్టార్ హీరోలకు బిగ్​ షాక్​!.. వారందరికి రెడ్ కార్డ్​.. ఏం తప్పు చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.