Tiger Nageswara Rao Day 2 Collections : ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ప్రతి హీరో తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకునే పనిలోనే ఉన్నారు. తమ సినిమాలను మరింత మందికి చేరేలా లార్జ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. బడా హీరోలు.. అచ్చం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అలా ఇప్పుడు తొలిసారి పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టారు మాస్ మహారాజా రవితేజ. తాజాగా టైగర్ నాగేశ్వరరావుతో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డీసెంట్ టాక్ అందుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మంచిగా రాగా.. రెండో రోజు కూడా మంచిగానే వసూళ్లు వచ్చాయి. రెండో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 25.91 శాతం.. మధ్యాహ్నం ఆక్యూపెన్సీ 43.22శాతం, ఈవెనింగ్ ఆక్యూపెన్సీ 39.01 శాతం, నైట్ ఆక్యూపెన్సీ 59.04 శాతం నమోదయ్యాయట.
కలెక్షన్స్ వివరాల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఓపెనింగ్ డే రూ. 5.50 కోట్ల షేర్.. ఇండియా వైడ్‌గా అన్నీ భాషల్లో రూ.8కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... వరల్డ్ వైడ్‌గా రూ. 4.00 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలిసింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌కు చేరువగా వచ్చింది. ఇండియావైడ్‌గా అన్నీ భాషల్లో కలిపి తొలి రోజు రూ.8కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.4.75కోట్ల నెట్ అందుకుందట. అంటే 12.75కోట్లు నెట్ వచ్చాయన్న మాట. అదే బాలయ్య భగవంత్ కేసరి కేవలం రెండో రోజుల్లో రూ.20కోట్లకు పైగా షేర్ వసూళ్లను అందుకుంది.
-
MASS MAHARAJA @RaviTeja_offl is hunting at the box office with #TigerNageswaraRao ❤️🔥
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
BOOK YOUR TICKETS for the 𝗥𝗢𝗔𝗥𝗜𝗡𝗚 𝗗𝗔𝗦𝗔𝗥𝗔 𝗪𝗜𝗡𝗡𝗘𝗥 NOW 🐅
- https://t.co/yOg5E0c9LP@DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta… pic.twitter.com/1hL9j5EsIN
">MASS MAHARAJA @RaviTeja_offl is hunting at the box office with #TigerNageswaraRao ❤️🔥
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023
BOOK YOUR TICKETS for the 𝗥𝗢𝗔𝗥𝗜𝗡𝗚 𝗗𝗔𝗦𝗔𝗥𝗔 𝗪𝗜𝗡𝗡𝗘𝗥 NOW 🐅
- https://t.co/yOg5E0c9LP@DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta… pic.twitter.com/1hL9j5EsINMASS MAHARAJA @RaviTeja_offl is hunting at the box office with #TigerNageswaraRao ❤️🔥
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023
BOOK YOUR TICKETS for the 𝗥𝗢𝗔𝗥𝗜𝗡𝗚 𝗗𝗔𝗦𝗔𝗥𝗔 𝗪𝗜𝗡𝗡𝗘𝗥 NOW 🐅
- https://t.co/yOg5E0c9LP@DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta… pic.twitter.com/1hL9j5EsIN
Tiger Nageswara Rao Review : ' టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో ఆరంభ సన్నివేశాలు, రవితేజ నటన, సంగీతం, ఛాయాగ్రహణం బలాలుగా నిలిచాయి. కథ, కథనాలు... మరీ ఎక్కువ ఆసక్తి రేకెత్తించలేదు, భావోద్వేగాలు కాస్త తగ్గాయని సినీ ప్రియులు అంటున్నారు.
Leo Movie Day 2 Collections : కాస్త డౌన్.. ఇండియాలో రూ.100కోట్ల క్లబ్‌లోకి.. మొత్తంగా ఎంతంటే?
Bhagavanth Kesari Day 3 Collections : బాక్సాఫీస్ ముందు అంతా బాలయ్య సౌండే.. అప్పుడే అన్ని కోట్లా!