ETV Bharat / entertainment

సూర్య కొత్త సినిమా ఆమెతోనే..- 'అటాక్‌' హిట్​ టాక్​ - john abraham comments

తమిళ స్టార్​ సూర్య కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది. 'ఆకాశమే నీ హద్దురా' దర్శకురాలితో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌ 1న విడుదలైన 'అటాక్‌'కు హిట్​ రావడం పట్ల హీరో జాన్​ అబ్రహం ఆనందం వ్యక్తం చేశారు.

surya, john
సూర్య, జాన్​
author img

By

Published : Apr 7, 2022, 7:21 PM IST

'గురు', 'ఆకాశమే నీ హద్దురా'.. దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధా కొంగర.. తన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. సూర్యతో తన తర్వాతి సినిమా ఉండనుందని వెల్లడించారు. సూర్య- సుధ కాంబినేషన్​లో వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొత్త సినిమాపై పలు విషయాలను వెల్లిడించారు సుధ. ఈ చిత్రం బయోపిక్ కాదని, నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.

ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో నటించిన 'అటాక్‌' ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. జాన్ అబ్రహాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. '‘వెండితెరపై మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పరిశ్రమకు మా తరఫున ఏదైనా వినూత్నంగా అందించాలనుకున్నాం. అందులో భాగమే ‘అటాక్‌’. కరోనా మూడు దశలను దాటుకుని సినిమాను విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది. అయినా మేము అనుకున్నది సాధించాం. ఈ సినిమా కోసం నిజాయితీతో శ్రమించిన ప్రతి టీమ్‌ సభ్యుడికి ధన్యవాదాలు' అంటూ నెటిజన్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.