ETV Bharat / entertainment

South Stars Guest Roles : సినిమాల్లో అనుకోని అతిథులు.. అలా వచ్చి ఇలా మెరిశారు.. - ఆర్​ఆర్​ఆర్​లో అజయ్​ దేవగణ్​

South Stars Guest Roles : ఇటీవలి కాలంలో ఎంతో మంది స్టార్​ హీరోస్​ అతిథులగా మారి అలరిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఈ పాత్ర గెస్ట్​ రోల్​ కాకపోయినప్పటికీ.. సినిమాలో వాళ్ల రోల్​ కీలకం అనేలా ఉంటుంది. అలాంటి సినిమాలు ఇటీవలి కాలంలో చాలానే వచ్చాయి. ముఖ్యంగా మన టాలీవుడ్​ హీరోలు ఈ లిస్ట్​లో ముందంజలో ఉన్నారు. వారెవరంటే..

South Stars Guest Roles
South Stars Guest Roles
author img

By

Published : Aug 5, 2023, 10:31 AM IST

Updated : Aug 5, 2023, 12:22 PM IST

South Stars Guest Roles : సినిమా స్టార్స్​ అందరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు పక్క స్టార్స్​ సినిమాల్లో మెరుస్తుంటారు. సినిమాలో పాత్రకున్న నిడివితో సంబంధం లేకుండా తమకున్న పరిధిలో నటించి ప్రేక్షకుల మనసులు దోచేస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా.. క్యారెక్టర్​ నచ్చితే సినిమాకు ఓకే చెప్పేస్తున్నారు. అలా ఇటీవలి కాలంలో ఎంతో మంది స్టార్​ హీరోస్​ అతిథులగా మారి అలరిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఈ పాత్ర గెస్ట్​ రోల్​ కాకపోయినప్పటికీ.. సినిమాలో వాళ్ల రోల్​ కీలకం అనేలా ఉంటుంది. అలాంటి సినిమాలు ఇటీవలి కాలంలో చాలానే వచ్చాయి. ముఖ్యంగా మన టాలీవుడ్​ హీరోలు ఈ లిస్ట్​లో ముందంజలో ఉన్నారు. వారెవరంటే..

  • ఇటీవలే దర్శకుడు శేఖర్​ కమ్ముల తన అప్​కమింగ్ ప్రాజెక్ట్​ గురించి అనౌన్స్​ చేశారు. ధనుశ్​ లీడ్ రోల్​లో తెరకెక్కుత్న ఈ సినిమాలో కింగ్​ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారట. అయితే అప్పట్లోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆ కల నిజమయ్యేలా కనిపిస్తుంది.
  • ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మాస్​ మహారాజా రవితేజ గెస్ట్​ రోల్​లో కనిపించారు. ఇందులో ఆయన చిరంజీవికి తమ్మడి పాత్రలో నటించారు. సినిమాలో ఆయన పాత్ర నిడివి కాసేపే అయినప్పటికీ.. తన స్క్రీన్​ ప్రెజెన్స్​తో ఆడియెన్స్​ను అలరించారు.
  • టాలీవుడ్​ దర్శకుడు అనుదీప్​ తెరకెక్కించిన కామెడీ మూవీ 'జాతి రత్నాలు'లో విజయ్ దేవరకొండ కేమియో రోల్​లో కనిపించి మెప్పించారు.
  • ఇక ఈ లిస్ట్​లో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్​ రజనీకాంత్​ కూడా జాయినయ్యారు. తన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న 'లాల్ సలామ్‌' అనే సినిమా కోసం అతిథిగా మారిపోయారు. ఓ వైపు 'జైలర్‌' సినిమాలో నటిస్తూనే..మరోవైపు ఈ సినిమా షూట్​లోనూ పాల్గొన్నారు.
  • తాజాగా పవన్​ కల్యాణ్​- సాయిధరమ్​ తేజ్​ నటించిన బ్రో సినిమాలో కూడా పవన్​ ఓ రకంగా గెస్ట్​ రోల్​ చేశారు. అందులో సాయి ధరమ్ తేజ్ హీరో అయినప్పటికీ.. మరో కీలక పాత్రలో పవన్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పట్లో 'గోపాలా గోపాలా' సినిమాలోనూ పవన్ ఇలాంటి పాత్ర చేశారు.
  • ఇక మాస్​ కా దాస్​ విశ్వక్​సేన్ లీడ్​ రోల్​లో వచ్చిన 'ఓరి దేవుడా' సినిమాలో ఓ కీలక పాత్రను విక్టరీ వెంకటేశ్ పోషించారు. 'ఆర్​ఆర్​ఆర్' సినిమాలో బాలీవుడ్ స్టార్​ హీరో అజయ్ దేవ్‌గన్ తో పాటు నటి శ్రియా కూడా అతిథి పాత్రలో కనిపించారు. అలాగే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా గెస్ట్ రోల్​లో కనిపించనున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా సినిమాలో నాని ఓ చిన్నపాటి పాత్ర చేస్తున్నారని టాక్​.

Last Updated : Aug 5, 2023, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.