ETV Bharat / entertainment

అవును నా శరీరంలో ఆ భాగానికి సర్జరీ చేయించుకున్నా: శ్రుతిహాసన్​ - శ్రుతిహాసన్​ ముక్కు సర్జరీ

తన శరీరంలో ఓ భాగానికి సర్జరీ చేయించుకోవడంపై మరోసారి స్పందించింది హీరోయిన్ శ్రుతిహాసన్​. ఏం చెప్పిందంటే..

Shrutihassan nose surgery
శ్రుతిహాసన్ ముక్కు సర్జరీ
author img

By

Published : Oct 14, 2022, 7:38 AM IST

Updated : Oct 14, 2022, 9:13 AM IST

దిగ్గజ నటుడు కమల్‌హాసన్‌ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడగుపెట్టి మల్టీటాలెంటెడ్​తో తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్​ను దక్కించుకున్న హీరోయిన్​ శ్రుతిహాసన్‌. నటిగా, సింగర్‌గా ఫుల్​ క్రేజ్​ దక్కించుకుంది.

అయితే తాజాగా మరోసారి తన ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీచేయించుకున్న విషయాన్ని చెప్పింది. "అవును, నేను నా ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాను. అది వంకరగా ఉండేది. దాని వల్ల నేను బాధ పడ్డాను. అందుకే నేను నా ముక్కును సరిచేయించుకున్నాను. నా మొదటి సినిమా సర్జరీకి ముందు చేసిందే. ఇది నా శరీరం.. దీన్ని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది" అని చెప్పింది.

తన ప్లాస్టిక్‌ సర్జరీ గురించి శ్రుతిహాసన్‌ మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు "నా శరీరంలో నాకు నా ముక్కు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నేను దాని కోసం ఎక్కువ ఖర్చుపెట్టాను" అని సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే 'క్రాక్', 'వకీల్‌సాబ్‌' విజయాలను తన ఖాతాలో వేసుకున్న శ్రుతిహాసన్‌. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌' , బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. 'కేజీయఫ్‌' ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌', గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ 107వ సినిమా తెరకెక్కుతున్నాయి.

ఇదీ చూడండి: మణిరత్నం దర్శకత్వంలో రజనీ.. ఒకేరోజు ఖాన్‌ల సందడి

Last Updated : Oct 14, 2022, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.