ETV Bharat / entertainment

షారుక్​ 'పఠాన్'​ అస్సలు ఆగట్లేదుగా.. ఐదు రోజుల్లో రూ.550కోట్లు - పఠాన్ ఐదు రోజుల్లో 500 కోట్లు

బాలీవుడ్ బాద్​ షా నటించిన పఠాన్​ కలెక్షన్స్​ బాక్సాఫీస్​ వద్ద రికార్డుల జోరును కొనసాగిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.500కోట్ల క్లబ్​లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఎంత వసూలు చేసిందంటే?

Sharukh Pathaan World wide collections 550 crores in Five days
షారుక్​ 'పఠాన్'​ అస్సలు ఆగట్లేదుగా.. ఐదు రోజుల్లో రూ.550కోట్లు
author img

By

Published : Jan 30, 2023, 2:06 PM IST

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన 'పఠాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తోంది.ఐదు రోజుల్లో రూ.500కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే కాకుండాసరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఐదో రోజు కేవలం హిందీలో రూ.60 నుంచి 65కోట్లు సాధించినట్లు తెలిసింది. మొత్తంగా ఫస్ట్​ వీకెండ్​ పూర్తయ్యే సరికి గ్లోబల్​ బాక్సాఫీస్​ ముందు 67.84 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో రూ.550కోట్లు సాధించినట్లు తెలిసింది. భారత్​లో రూ.280కోట్లకు పైగా వసూలు చేసిందట. ఇక యూఏఈలో ఫస్ట్​ వీకెండ్​లో హైయెస్ట్ కలెక్షన్స్​ సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. అవెంజర్స్ ఎండ్​గేమ్​ రూ.5.94మిలియన్ డాలర్స్​తో అగ్రస్థానంలో ఉండగా.. పఠాన్​ 4.80మిలియన్ డాలర్స్​, ఎఫ్​ 8 4.64 మిలియన్ డాలర్స్​,

ఇకపోతే పఠాన్​.. ఇండియావైడ్‌గా రూ.250 కోట్ల క్లబ్​లోకి కేవలం 5 రోజుల్లోనే ఎంటర్​ అయ్యి రికార్డు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కేజీయఫ్ 2.. రూ. 250 కోట్ల క్లబ్‌లోకి 7 రోజుల్లో చేరితే.. బాహుబలి2 ఎనిమిది రోజుల్లో, దంగల్ 10వ రోజు, టైగర్ జిందా హై పదో రోజు చేరాయి.

కాగా, యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రమిది. హీరో షారుక్​ ఖాన్‌ , హీరోయిన్‌ దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం నటనకు, యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఓ పాట విషయంలో ఈ సినిమా విడుదలకు ముందు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వాటిని అధిగమించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే తన క్రేజ్‌ చూపించిందీ చిత్రం. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి అదే హవా కొనసాగిస్తోంది. 32 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో హౌజ్‌ఫుల్‌ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ బృందం ప్రకటించింది.

ఇదీ చూడండి:

చిరు 'వాల్తేరు వీరయ్య' 17 డేస్​ కలెక్షన్స్​.. ఊహించని రేంజ్​లో బాక్సాఫీస్​ షేక్​!

బాలయ్య 'వీర సింహారెడ్డి' రోర్​.. 18 రోజుల్లో బాక్సాఫీస్​ కలెక్షన్​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.