ETV Bharat / entertainment

రవితేజ కోసం భారీ ఖర్చు.. సెట్​ కోసమే అన్ని కోట్లా? - Raviteja tiger nagesswarao release date

Raviteja Tiger Nageswara rao: రవితేజ నటిస్తున్న బయోపిక్​ చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు'. ఈ మూవీ కోసం 70వ దశకం నాటి స్టూవర్టుపురంను తలపించేలా భారీ సెట్‌ను నిర్మిస్తోంది చిత్ర బృందం. దీని కోసం దాదాపు రూ.7కోట్లు ఖర్చు చేయనున్నారట!

Raviteja Tiger Nageswara rao
రవితేజ టైగర్​ నాగేశ్వరరావు సినిమా సెట్​
author img

By

Published : Apr 17, 2022, 8:26 AM IST

Updated : Apr 17, 2022, 11:48 AM IST

Raviteja Tiger Nageswara rao: మాస్​మహారాజా రవితేజ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అందులో 'టైగర్‌ నాగేశ్వరరావు' ఒకటి. రవితేజ నటించనున్న తొలి పాన్​ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రొడ్యూసర్' అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నాయికలు. 70వ దశకంలో స్టూవర్టుపురం రాబిన్‌ హుడ్‌గా పేరు పొందిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రం కోసం 70వ దశకం నాటి స్టూవర్టుపురంను తలపించేలా భారీ సెట్‌ను నిర్మిస్తోంది చిత్ర బృందం. శంషాబాద్‌ సమీపంలోని 5 ఎకరాల విస్తీర్ణంలో... దాదాపు రూ.7కోట్ల ఖర్చుతో ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా పర్యవేక్షణలో ఈ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక ఎపిసోడ్లన్నీ ఇందులోనే చిత్రీకరించనున్నట్లు తెలిసింది. మీ మూవీకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తుండగా.. శ్రీకాంత్‌ విస్సా డైలాగ్స్‌ రాశారు. ఆర్‌ మదీ ఛాయాగ్రహణం అందించారు. ఇక రవితేజ విషయానికొస్తే.. ఆయన ఈ చిత్రంతో పాటు 'రామారావు ఆన్​ డ్యూటీ', 'రావణాసుర', 'ధమాకా' సినిమాల్లోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి:

నా పెళ్లి గురించి అప్పుడే చెబుతా: ప్రభాస్​

ఆ సమయంలో చాలా భయపడ్డా: దుల్కర్​ సల్మాన్​

Last Updated : Apr 17, 2022, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.