ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు నాగశౌర్య క్షమాపణలు.. ఎందుకంటే ? - హీరో నాగశౌర్య న్యూస్

Rangabali Hero : రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్​ అందుకుంటున్న హీరో నాగశౌర్య తాజాగా ప్రేక్షకులకు సారీ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

nagashaurya
hero nagashaurya
author img

By

Published : Jul 8, 2023, 7:39 PM IST

Rangabali Hero Naga Shaurya : ఇటీవలే విడుదలై మంచి టాక్​ టాక్​ అందుకుంటున్న తమ చిత్రం 'రంగబలి'ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి 'బాగుంది' అని మెచ్చుకుంటున్నారని హీరో కథానాయకుడు నాగశౌర్య అన్నారు. శనివారం ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్‌ మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా మూవీ టీమ్​ విలేకరులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

'మీకు మీడియాపై సెటైర్‌ వేయాలని ఎందుకు అనిపించింది?' అని ఓ విలేకరి అడగ్గా.. ఆ ప్రశ్నకు నాగశౌర్య సమాధానం ఇచ్చాడు. "మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. అదే మీడియా వాళ్లు, పలువురు రాజకీయ నాయకుల డూప్​లను పెట్టి వీడియోలు చేస్తారు. మా సినిమా ప్రమోషన్స్‌ కోసం అందరికీ తెలిసిన వ్యక్తులను మేము ఎంపిక చేసుకున్నాం. ఒక హీరోను వాళ్లు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని మేము సరదాగా చేశాం. ఇందులో ఎవరినీ ఎగతాళి చేయలేదు. అలాగే ముందుగా అనుకునైతే చేయలేదు. మా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే 'క్షమించండి'. ఫలానా వారి మనోభావాలు దెబ్బతీయాలని మాత్రం మేము ఆ వీడియోను చేయలేదు. 'ఒకరిద్దరు బాధపడ్డారు' అని వేరే వాళ్లు ప్రచారం చేయడం వల్ల ఆ న్యూస్‌ ట్రెండ్‌ అయింది" అని నాగశౌర్య అన్నారు.

Rnagabli Movie Press meet : ఇక సెకెండ్​ హాఫ్​ సీరియస్‌గా ఉందని మరొకరు అడగ్గా.. "ఫస్టాఫ్‌లో కామెడీ డోస్‌ కాస్త ఎక్కువైంది. కంటెంట్‌తో వెళ్తేనేమో మరీ సాగదీశారు అని అంటారు. కేవలం నవ్వుల కోసమే అయితే, మా దగ్గర అటువంటివి చాలా సీన్స్‌ ఉన్నాయి. జనాలను చెడగొట్టకుండా ఏదో ఒక మంచి కథతో రావాలన్నదే మా ఉద్దేశం. ఇప్పటివరకూ చాలా మంది హీరోలు ఇలానే వచ్చారు. కేవలం అడల్ట్‌ కంటెంట్‌, వెకిలి కామెడీ కావాలంటే మా దగ్గర చాలా స్క్రిప్ట్‌లు ఉన్నాయి" అని నాగశౌర్య చెప్పుకొచ్చారు.

'సినిమా కథ కన్నా ప్రచారం కోసం వాడిన స్పూఫ్‌లపై దృష్టి ఎక్కువగా పెట్టారు. అలా కాకుండా సెకండ్​ హాఫ్‌పై ఇంకా దృష్టి పెట్టి ఉంటే, ఈ సినిమా మంచి విజయం సాధించేది కదా' అని మరొక్కరు అడగ్గా.. ఆ ప్రశ్నకు దర్శకుడు పవన్‌ సమాధానం ఇచ్చారు.

"గోదావరి జిల్లాల వాళ్లకు వెటకారం పుట్టుకతో వచ్చింది. స్క్రిప్ట్‌ పరంగా ఎలాంటి సమస్య లేదు. దానిపై నేను వందశాతం నమ్మకంతోనే ఉన్నాను. ఫస్ట్​ హాఫ్‌లో ఫన్‌ ఎక్కువగా ఉందంటే దానికి హీరో నాగశౌర్య, సత్యల పాత్రలే కారణం. ద్వితీయార్ధంలోనూ ఆ పాత్రలు అలానే ఉన్నాయి. అయితే, కథ అనేది ఒకటి చెప్పాలి. ఓ దర్శకుడిగా ఆ విషయానికి కట్టుబడి ఉన్నాను. ఫస్ట్​ హాఫ్​ చూసి, సెకండాఫ్‌ కూడా అలాగే ఉంటుందని అందరూ అనుకున్నారు. బిర్యానీ తినేవాడికి పప్పన్నం తినమని చెబితే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. నెమ్మదిగా అందరికీ నచ్చుతుంది. ఇక స్ఫూఫ్‌ ఇంటర్వ్యూల విషయానికొస్తే, చిన్నప్పటి నుంచి మనం చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల సినిమాలు చూసి, వాళ్లు చేసినట్లే చేసి, హీరోల్లా ఫీలవుతాం. ఈ ఇంటర్వ్యూ కూడా అలాంటిదే. రెండో భాగంలో కూడా సత్య క్యారెక్టర్‌తో కామెడీ చేయించవచ్చు. అప్పుడు నేను రాసుకున్న కథకు న్యాయం చేయలేను. పైగా అంత పెద్ద టైటిల్‌ పెట్టుకుని ఇంత ఫన్నీగా సినిమా ఎలా తీశాడంటారు" అని సమాధానం ఇచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.