Ranbir Kapoor Animal Movie : టాలీవుడ్లో విడుదలైన 'అర్జున్ రెడ్డి' సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్స్ సినిమాకు ప్లస్ పాయింట్లుగా మారాయి. అంతే కాకుండా ఈ సినిమా విజయ్ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ తర్వాత ఈ సినిమా తమిళంతో పాటు హిందీలోనూ రీమేక్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది.
మూవీ లవర్స్ కూడా ఈయన మరో ప్రాజెక్ట్‌ను ఎప్పుడు పట్టాలెక్కిస్తారని ఆతృతగా ఎదురుచూశారు. అయితే 'అర్జున్ రెడ్డి' తర్వాత హిందీలో 'కబీర్ సింగ్'ను తెరకెక్కించిన సందీప్.. రెండేళ్లు గ్యాప్ తీసుకుని పాన్ఇండియా లెవెల్లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించే పనుల్లో పడిపోయారు.
అసలు ఈ ఇద్దరి కాంబోలో ఇటువంటి సినిమా వస్తోందంటే మొదట అందరూ ఆశ్చర్యపోయారు. రణ్‌బీర్ కపూర్ లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ గల వ్యక్తి భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఎలా చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో విడుదలైన ఓ గ్లింప్స్ అందరి దిమ్మతిరిగేలా చేసింది. అందులో రణ్‌బీర్ లుక్‌తో పాటు యాక్షన్ సీన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై ఓ రెంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఒక్క గ్రింప్స్కే ఈ రెంజ్లో హైప్ రావడం చాలా అరుదు. ఆ తర్వాత వచ్చిన టీజర్, సాంగ్స్‌ను కూడా హై లెవెల్లో తీర్చిదిద్దారు దర్శకుడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్ మొదలు పెట్టాలి. కానీ అవేం ప్రారంభం కాకుండానే ఈ సినిమాకు ఓ రేంజ్లో హైప్ వచ్చేసింది. అయితే ఇది శాంపిల్ మాత్రమే అన్నది మూవీ టీమ్ మాట. ఈ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే వైలెన్స్‌తో పాటు విలన్లను వణికించే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. మరోవైపు ఈ సినిమాలో రణ్‌బీర్ ఫ్యామిలీ చేసే హత్యలు, దారుణాలు వేరే లెవెల్లో ఉంటాయని టాక్ నడుస్తోంది. ఇంతటి వైలెన్స్ చూస్తుంటే ఈ సినిమా ఏ సర్టిఫికెట్‌తోనే థియేటర్లలో సందడి చేసేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Ranbir kapoor Movie Break : రణ్‌బీర్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు బ్రేక్.. ఆమె కోసమే!