ETV Bharat / entertainment

Rajnikanth kamalhassan : రజనీ.. కమల్​ రేంజ్​లో సక్సెస్​ను అందుకుంటారా? - కమల్​ హాసన్ విక్రమ్ మూవీ హిట్

Rajnikanth kamal haasan : రజనీకాంత్​ 'జైలర్' సినిమా మరో ఐదు రోజుల్లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా రజనీకాంత్​కు.. కమల్​ విక్రమ్​ స్టైల్​లో భారీ రేంజ్ సక్సెస్​ను అందిస్తుందా?

Rajinikanth kamal haasan
Rajinikanth kamal haasan
author img

By

Published : Aug 5, 2023, 5:26 PM IST

Rajnikanth kamal haasan : రజనీకాంత్‌ - కమల్‌హాసన్‌.. దాదాపు ఐదు దశాబ్దాలుగా పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్స్​గా క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఇప్పుటికీ అభిమానుల్లో విపరీతమైన భారీ ఆసక్తి ఉంటుంది. రజనీ తన స్టైల్‌​తో అభిమానులను అలరిస్తే.. కమల్​ భిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు.

అయితే చాలా కాలం పాటు ఈ ఇద్దరు బడా స్టార్​ తమ స్టార్ స్టేటస్​కు తగ్గట్టు సరైనా హిట్​ను అందుకోలేకపోయారు. ​రీసెంట్​గానే కమల్​ హాసన్​ 'విక్రమ్'​ చిత్రంతో ఊహించని రేంజ్​లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​ హిట్​తో మళ్లీ సక్సెస్ ట్రాక్​ ఎక్కారు. అప్పుడెప్పుడో 2013లో 'విశ్వరూపం' చిత్రంతో సక్సెస్​ను అందుకున్న ఆయన.. ఆ తర్వాత ఉత్తమ విలన్, చీకటి రాజ్యం సహా పలు చిత్రాలతో అభిమానులను అలరించారు. వాటిలో 'పాపనాశం' సినిమా మాత్రమే సక్సెస్​ను అందుకుంది. అది కూడా తమిళనాడు వరకే పరిమితమైంది.

Kamalhassan vikram movie : అయితే ఆ తర్వాత కమల్​.. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్​లో 'విక్రమ్'​ చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్​ ముందు ఊహించని సక్సెస్​ను అందుకున్నారు. దాదాపు రూ.500కోట్ల వరకు వసూలు చేశారు. ఈ విజయంతో ఒకేసారి నాలుగు బడా సినిమాలను లైన్​లై పెట్టేశారు. ఇండియన్ 2, ప్రాజెక్​ కె కల్కి, యాక్షన్ డైరెక్టర్​ హెచ్ వినోద్​, పొన్నియిన్ సెల్వన్​ మణిరత్నంతో మరో సినిమాను చేస్తున్నారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇంకా భారీ రేంజ్ హిట్​​ కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. చంద్రముఖి, శివాజి, రోబో(2010) తర్వాత ఆయన తన స్టార్ డమ్​కు తగ్గట్టు హిట్​ను అందుకోలేదు. కబాలి, కొచ్చాడియన్​, కాలా, లింగ, రోబో 2.0, పేటా, దర్బార్​​, అన్నాత్తే అన్ని కమర్షియల్​గానే ఆకట్టుకున్నాయి. కథ పరంగా అభిమానుల్ని విశేషంగా అలరించలేదు.

Rajnikanth Jailer movie : అయితే రజనీ ప్రస్తుతం.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్​లో 'జైలర్' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్​ ట్రైలర్ అభిమానుల్ని అలరించింది. ఈ చిత్రంతోనైనా రజనీ గట్టి కమ్​ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. కమల్​ హాసన్​కు 'విక్రమ్'​ ఎలా అయితే గట్టి కమ్​ బ్యాక్ ఇచ్చిందో..రజనీకి కూడా జైలర్​ అలానే టర్నింప్ పాయింజ్ అవ్వాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఆగస్ట్​ 10న రాబోయే ఈ మూవీ రజనీకి ఏమేర విజయాన్ని అందిస్తుందో, భారీ హిట్​ను ఇస్తుందో లేదో..

సినిమాల్లో నయా ట్రెండ్​.. హీరోస్ విత్​ 'గన్స్'.. విలన్స్​పై దండయాత్రే!

Rajinikanth Jailer Trailer : పవర్​ఫుల్​గా 'జైలర్' ట్రైలర్​.. రజనీ అదే స్టైల్, అదే స్వాగ్.. ఎక్కడా తగ్గలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.