ETV Bharat / entertainment

ప్రభాస్ 'ప్రాజెక్ట్​ కె'లో కీలక మార్పు - ప్రభాస్ ప్రాజెక్ట్ కె కొత్త మ్యూజిక్ డైరెక్టర్​

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్‌-కె'లో కీలక మార్పు జరిగింది. ఆ వివరాలు..

Project K prabhas
ప్రభాస్ 'ప్రాజెక్ట్​ కె'లో కీలక మార్పు
author img

By

Published : Feb 25, 2023, 7:58 PM IST

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ 'ప్రాజెక్ట్‌-కె'. దీపిక పదుకొణె హీరోయిన్​. బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమా మొదట ప్రకటించినప్పుడు మ్యూజిక్​ డైరెక్టర్​గా మిక్కీ జె మేయర్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో సంతోష్‌ నారాయణన్​ను తీసుకోవాల్సి వచ్చింది . ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

"ప్రాజెక్ట్‌-కె సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ మూవీ అయినప్పటికీ ఎమోషన్స్‌, సెంటిమెంట్స్​ కూడా ఉంటాయి. ఇప్పటివరకూ ఈ మూవీ షూటింగ్​ 70 శాతం పూర్తైంది. ప్రభాస్‌తో పాటు, దీపిక, అమితాబ్‌లకు కూడా స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురూ కలిసి కనిపిస్తారు. ఆడియెన్స్​ ఇప్పటివరకు చెందని సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ ఓ ఐదారు కంపెనీలు చేస్తున్నాయి. వాటిని తెరపై చూసినప్పుడు న భూతో నభవిష్యతి అన్నట్లు ఉంటుంది." అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే వరుసగా తమిళ చిత్రాలకు పని చేస్తున్న సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన ఇప్పటివరకు అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్​ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆడియెన్స్​కు గూస్​ బంప్స్​ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఆయన తెలుగులో నాని 'దసరా', వెంకటేశ్‌ 'సైంధవ్‌'కు మ్యూజిక్​ను అందించారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న 'ప్రాజెక్ట్‌ కె' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఇటీవల సోషల్​మీడియా ద్వారా తెలిపింది.

ఇదీ చూడండి: ఇంత హాట్​గా వంట వండి వడ్డిస్తే.. ఎవరు మాత్రం కాదంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.