Prabhas Maruti Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఓ వైపు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 ఏడీ' చిత్రీకరణలో పాల్గొంటూనే మరోవైపు మారుతి రూపొందిస్తున్న సినిమా షూటింగ్ పనుల్లో నిమగ్నమైపోయారు. రెండు షూట్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఫ్యాన్స్ అందరూ కల్కి తో పాటు మారుతి సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో హీరోయిన్ మాళవిక మోహనన్ చేతిలో రాడ్ పట్టుకుని విలన్లను చితకబాదుతూ కనిపించింది. చూస్తూంటే ఈ షూట్ కూరగాయల మార్కెట్లో జరిగినట్లు అనిపిస్తోంది. అయితే ఇది ప్రభాస్-మారుతి సినిమాదే కాదా అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే మళవిక రీసెంట్గా ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. అది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫైట్ వీడియోకు రిలేటడ్గా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఇది కచ్చితంగా ప్రభాస్ మూవీదే అయ్యుంటుందంటూ అభిప్రాయపడుతున్నారు.
-
From the Sets of #prabhas #Maruthi Film. Heroine ke ee level fights unnayi ante, Hero ki oohinchukuntene 🥵💥#MalavikaMohanan pic.twitter.com/ouBe6sqTQj
— 🅺🅰🅸🅻🅰🆂🅷 (@KailashPrabhas_) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">From the Sets of #prabhas #Maruthi Film. Heroine ke ee level fights unnayi ante, Hero ki oohinchukuntene 🥵💥#MalavikaMohanan pic.twitter.com/ouBe6sqTQj
— 🅺🅰🅸🅻🅰🆂🅷 (@KailashPrabhas_) September 15, 2023From the Sets of #prabhas #Maruthi Film. Heroine ke ee level fights unnayi ante, Hero ki oohinchukuntene 🥵💥#MalavikaMohanan pic.twitter.com/ouBe6sqTQj
— 🅺🅰🅸🅻🅰🆂🅷 (@KailashPrabhas_) September 15, 2023
Prabhas Maruthi Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కామెడీ, హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇందులో డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన షెడ్యూల్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. అయితే ఇప్పటి వరకు టైటిల్, షూటింగ్, క్యాస్టింగ్‌కు సంబంధించి విషయాలపై అభిమానుల్లో సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది మూవీ టీమ్.
ఇక ప్రభాస్ లైనప్ చూస్తుంటే.. ప్రభాస్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ'తో పాటు 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరోవైపు యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'సలార్' సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Prabhas Line Up Movie : ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ లైనప్.. ఫుల్ కన్ఫ్యూజన్ భయ్యా!
ప్రభాస్, మారుతి సినిమాలో సంజయ్ దత్.. ఏ పాత్ర చేయబోతున్నాడో తెలుసా?