ETV Bharat / entertainment

నాగార్జునతో సినిమా.. అది ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమన్న పూజా హెగ్డే - పూజాహెగ్డేకు ఆ సినిమా ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం

వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే తనకిష్టమైన సినిమా గురించి మాట్లాడింది. దీంతో నాగార్జునతో ఆమె ఓ సినిమా చేయనుందంటూ వస్తున్న వార్తలపై ఆమె సన్నిహిత వర్గాలు స్పందించాయి. ఆ సంగతులు..

Pooja hegdey ala vaikunthapurramuloo
ఆ సినిమా ఎప్పటికీ నాకెంతో ప్రత్యేకం: పూజా హెగ్డే
author img

By

Published : Jan 13, 2023, 5:51 PM IST

Updated : Jan 13, 2023, 5:57 PM IST

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌- హీరోయిన్​ పూజా హెగ్డే నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సైతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా 'బుట్టబొమ్మ' పాట అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ పాటే కనిపించేది, వినిపించేది. అయితే ఈ మూవీ విడుదలై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా పూజా హెగ్డే ట్విటర్‌లో స్పందించారు.

బుట్టబొమ్మ పాట క్లిపింగ్‌తో ఉన్న వీడియో పోస్ట్‌ చేసిన పూజా "అమూల్య పాత్రకు మూడేళ్లవుతోంది. 'అల వైకుంఠపురములో' సినిమా నాకెప్పుడు ప్రత్యేకమైనదే. నా హృదయంలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది" అని తెలిపింది. ఈ వీడిమో చూసిన నెటిజన్లు మరొకసారి మీ జోడిని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నాం అని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా బాలీవుడ్‌లోనూ తన హవా చాటుతోంది. తాజాగా ఈ అమ్మడు 'సర్కస్‌' సినిమాలో మెరిసింది. అలాగే బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

నాగార్జున కొత్త సినిమాలో.. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్​ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించే ఛాన్స్ ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని పూజ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇకపోతే నాగార్జున కుమారులు ఇద్దరితో పూజా హెగ్డే సినిమాలు చేశారు. నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం', అఖిల్​తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'లో నటించారు.

ఇదీ చూడండి: Pathan movie: షారుక్ మొదటి ప్రేయసి ఎవరో తెలుసా?

Last Updated : Jan 13, 2023, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.