Antey sundaraniki promo song: చాలాకాలం తర్వాత నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం 'అంటే... సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన మూవీటీమ్.. తాజాగా అంటే సుందరానికీ ప్రోమో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాటలోని హీరోహీరోయిన్ లుక్స్, లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ మూవీలో ఎంత వినోదం ఉంటుందో ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ చెప్పకనే చెప్పాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సుందర్‌గా నాని కనిపించనున్నారు. మలయాళ నటి నజ్రియా లీల అనే పాత్ర పోషించింది. నరేశ్, రోహిణి, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Nikhil Spy movie glimpse: 'గూఢచారి', 'ఎవరు', 'హిట్' వంటి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా స్పై. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో యంగ్ హీరో నిఖిల్ ప్రధా పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్యా మేనన్ కథానాయిక. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో నిఖిల్ మంచు కొండల్లో ఒంటరిగా నడుస్తూ కనిపించారు.
ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్‌ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బెల్లెట్లతో నింపుకుని యాక్షన్ చేస్తూ కనిపించారు. కాగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Tenth class diaries release date: అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. ఈ చిత్రంతో 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత అచ్యుత రామారావు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: పవర్ స్టార్ కోసం అభిమాని సాహసం.. ఏకంగా 400 కి.మీ నడుచుకుంటూ...