ETV Bharat / entertainment

ఛాన్స్​ కోసం ఏడాదిన్నర పాటు ఆఫీస్‌ బయట నాని.. కన్నీళ్లు పెట్టిస్తున్న వెన్నెల సీన్​! - దసరా సినిమా

రాధా గోపాళం చిత్రానికి క్లాప్‌ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన నేచురల్​ స్టార్​ నాని.. ఆ అవకాశం రావడం కోసం ఏకంగా ఏడాదిన్నర పాటు బాపు ఆఫీస్‌ ముందు రోజూ వేచి చూసేవారట. ఈ విషయాన్ని నాని తెలిపారు. మరోవైపు, దసరా సినిమాలో ఓ డిలీటెడ్​ సీన్​ను మేకర్స్ రిలీజ్ చేశారు.

dasara
dasara
author img

By

Published : Apr 9, 2023, 9:30 PM IST

టాలీవుడ్​ యంగ్​ హీరో నాని.. వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నటించిన దసరా సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రస్తుతం కెరీర్‌లో 30వ సినిమాలో నటిస్తున్న నాని నటుడు కాకముందు సహాయ దర్శకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు దర్శకత్వంలో వచ్చిన రాధా గోపాళం చిత్రానికి క్లాప్‌ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆయన ఆ అవకాశం రావడం కోసం ఏకంగా ఏడాదిన్నర పాటు బాపు ఆఫీస్‌ ముందు రోజూ వేచి చూసేవారట.

"దర్శకులకు మనం ఏదో రకంగా కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారని అనుకునేవాడిని. అందుకు ఏం చేయాలా? అని ఆలోచించా. దీంతో రోజూ ఉదయం 9 గంటల కల్లా బాపుగారి ఆఫీస్‌కు వెళ్లేవాడిని. బయట ఉండే కుర్చీల్లో కూర్చొని వాళ్లు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా? అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి రాత్రి 7 గంటల వరకూ వేచి చూసేవాడిని. ఆ సమయంలో నాకు కొంచెం పొట్ట ఉండేది. అలా వేచి చూడటం వల్ల అది మొత్తం పోయింది. ఎలాగంటే, లంచ్‌ టైమ్‌లో అందరూ ఆఫీస్‌ నుంచి బయటకు వస్తారు. ఆ సమయంలో నేను బయటకు వెళ్తే ఎవరికీ కనపడను. అందుకుని ఏడాదిన్నర పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా బాపుగారు, ఆయన టీమ్‌ వచ్చినప్పుడు కనపడాలని అలాగే ఉండేవాడిని. చివరిగా ఫైనల్‌గా వీడు వదిలేలా లేడు అని భావించి రాధాగోపాళం చిత్రానికి క్లాప్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ ఇచ్చారు. అది నాకు దక్కిన అదృష్టం. ఎందుకంటే బాపుగారి స్కూలు నుంచి నా కెరీర్‌ మొదలుపెట్టాలననే ఫీలింగ్‌ ఎప్పటికీ మర్చిపోను" అని నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

దసరా డిలీటెడ్‌ సీన్‌ చూశారా?
తాజాగా దసరా చిత్రం నుంచి డిలీట్‌ చేసిన ఓ సన్నివేశాన్ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. 'నిన్నే.. అంత కానిదాన్నైపోయినా.. ఆడెవడో వచ్చి తాళి కడతాంటే ఆపేది పోయి ఇంక మీదకెళ్లి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నవ్‌, నువ్వసలు తల్లివేనా?' అంటూ కీర్తి సురేశ్‌ డైలాగ్‌తో వీడియో మొదలైంది. అందరూ కూడా నా బతుకును ఎట్ల చేశిర్రో చూశినవా అని అత్త ముందు ఆవేదన వ్యక్తం చేసింది వెన్నెల.

వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి.. 'గిదే నీ ఇల్లు. ఈడ్నే నీ బతుకు.. నా మాట విని లోపలికి పోవే.. నీ బాంచెనే' అంటూ వెన్నెలను బతిమాలుకుని వెళ్లిపోతుంది. మోడువారిన చెట్టులా అక్కడే నిలబడిపోతుంది వెన్నెల. మరోవైపు ఈ సంభాషణంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి(నాని) వింటారు. ఈ వీడియో చూసిన జనాలు ఇది సినిమాలో ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.