ETV Bharat / entertainment

నాగ్​ 'ది ఘోస్ట్​' అదిరే అప్డేట్​.. 'యువ‌రాణి'గా త్రిష - నాగార్జున ది ఘోస్ట్​

నాగార్జున హీరోగా న‌టిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రం ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌చారాన్ని చిత్ర యూనిట్ ఖండించి టీజర్​ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది. నాగ్​ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. మరోవైపు, విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న తాజా చిత్రం 'పొన్నియ‌న్ సెల్వ‌న్‌'లో త్రిష ఫ‌స్ట్ లుక్‌ను గురువారం విడుద‌ల‌ చేశారు మేకర్స్​.

nagarajuna and trisha
nagarajuna and trisha
author img

By

Published : Jul 7, 2022, 2:30 PM IST

Nagarjuna The Ghost Movie: ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా త‌న యాక్ష‌న్​తో ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు హీరో నాగార్జున సిద్ధమవుతున్నారు. నాగార్జున హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'ది ఘోస్ట్‌'. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు గురువారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఓ యాక్ష‌న్ సీక్వెన్స్​ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

నాగార్జున కొత్త పోస్టర్
నాగార్జున కొత్త పోస్టర్

అంతేకాకుండా జులై 9న ఫ‌స్ట్ విజువ‌ల్ పేరుతో 'ది ఘోస్ట్' టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొంది. ఈ మేర‌కు నాగార్జున కొత్త పోస్ట‌ర్‌ను గురువారం మేకర్స్​ విడుద‌ల‌చేశారు. ఇందులో చేతిలో క‌త్తి ప‌ట్టుకొని శ‌త్రువుల‌పై పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లుగా నాగార్జున క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వాటిని చిత్ర‌యూనిట్ ఖండించింది. థియేట‌ర్ల‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

Ponniyin Selvan Trisha First Look: రోజుకొక కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తూ 'పొన్నియ‌న్ సెల్వ‌న్' సినిమా పట్ల అభిమానుల్లో ఉన్న ఆస‌క్తిని రెట్టింపు చేస్తున్నారు విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన విక్ర‌మ్‌, కార్తీ, ఐశ్వ‌ర్యరాయ్ పోస్ట‌ర్స్‌కు చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంది. తాజాగా హీరోయిన్​ త్రిష ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె యువ‌రాణి కుంద‌వాయి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సోషల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

యువరాణిగా త్రిష
యువరాణిగా త్రిష

పురుషాధిక్య ప్ర‌పంచంలో అస‌మాన ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తీక‌గా నిలిచిన యువ‌రాణిగా 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో త్రిష పాత్ర శ‌క్తిమంతంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ చిత్ర టీజ‌ర్ శుక్ర‌వారం రిలీజ్ కానుంది. చెన్నైలో భారీ ఈవెంట్​ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన 'పొన్నియ‌న్ సెల్వ‌న్' న‌వ‌ల ఆధారంగా రెండు భాగాలుగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

విక్ర‌మ్‌, కార్తీ, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యారాయ్, త్రిష‌, శోభిత దూళిపాళ్ల‌, శ‌ర‌త్ కుమార్ తో పాటు ద‌క్షిణాదికి చెందిన ప‌లువురు అగ్ర న‌టీన‌టులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్​తో లైకా ప్రొడక్షన్స్​తో కలిసి మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి: ఓటీటీలో అనుపమ 'బటర్​ప్లై' రిలీజ్!​.. కమల్​ 'ఇండియన్​ 2' నుంచి కాజల్​ ఔట్​?

అక్కడ పవర్ స్టార్ టాటూ.. 'నా బాడీ నా ఇష్టం' అంటూ బిగ్​బాస్​ బ్యూటీ పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.