'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం 'గోల్డెన్ గ్లోబ్' అందడం పట్ల యావత్ సినీ ప్రపంచం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'నాటు నాటు' పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికవ్వడం ఆనందంగా ఉందంటూ సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళిని అభినదించారు. తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తాను ముందే చెప్పినట్లు ప్రపంచ భాషల్లో తెలుగు భాష సత్తా చాటిందన్నారు.
థ్యాంక్యూ మావయ్య.. అయితే చంద్రబాబు ట్వీట్‌కు ఆర్‌ఆర్ఆర్ చిత్రంలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. "థాంక్యూ సో మచ్ మావయ్య" అంటూ రిప్లై ఇచ్చారు. అయితే చంద్రబాబు ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడంపై అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కీరవాణి కూడా 'థాంక్యూ వెరీ మచ్ సార్' అని చంద్రబాబు ట్వీట్‌కు బదులిచ్చారు.
ఇక ప్రధాని మోదీ కూడా.. "ఇదొక విశేషమైన విజయం!! కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్‌తోపాటు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర చిత్రబృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు" అని అభినందించగా.. దానికి జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ సార్ అని బదులిచ్చారు.
-
A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023
జగన్ ట్వీట్‌కు రిప్లై.. తారక్.. సీఎం జగన్‌కు కూడా థాంక్యూ చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై.. "తెలుగు జెండా రెపరెపలాడుతోంది! ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి తరఫున నేను.. కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, మొత్తం ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నాను. మేము మీ గురించి చాలా గర్వపడుతున్నాం" అని జగన్ ట్వీట్ చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్.. 'థాంక్యూ సార్' అని రిప్లై ఇచ్చారు.
-
The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023
ఇదీ చూడండి:
గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ సాంగ్‌గా 'నాటు నాటు'.. ఆ పాట గురించి ఈ విషయాలు తెలుసా?