ETV Bharat / entertainment

మెగా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. వాల్తేర్​ వీరయ్య రిలీజ్​ డేట్​ వచ్చేసిందోచ్​ - వాల్తేరు వీరయ్య చిరంజీవి

సంక్రాంతి పండుగకు అల్లుళ్లు ఇంటికి వచ్చి సందడి చేసినట్లు టాలీవుడ్​ అగ్రహీరోలు చిరు, బాలయ్య బాక్సాఫీస్​ ముందు తమ సినిమాలతో రానున్నారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య రిలీజ్​ తేదీని ప్రకటించింది.

Megastar Chiranjeevi Waltair Veerayya
Megastar Chiranjeevi Waltair Veerayya
author img

By

Published : Dec 7, 2022, 5:32 PM IST

Waltair Veerayya Release Date : టాలీవుడ్‌ స్టార్​ హీరో మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ రోల్‌లో న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్‌ లాంఛ్‌ చేసిన టైటిల్‌ టీజర్‌, బాస్ పార్టీ సాంగ్‌ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేయగా.. తాజాగా వచ్చిన మరో అప్డేట్​తో చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే సంక్రాంతి బరిలోకి దిగుతున్న నందమూరి బాలకృష్ణతో పాటు మెగాస్టార్ చిరంజీవి చిత్రాల విడుదల తేదీలు ఖరారు చేసిన యూనిట్​.. వీరసింహారెడ్డిని జనవరి 12న, వాల్తేరు వీరయ్య చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ రెండు చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం విశేషం.

వీరసింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా వాల్తేరు వీరయ్యకు బాబీ దర్శకుడు. ఇద్దరు అగ్రహీరోలు పోటీ లేకుండా ఒకరి తర్వాత ఒకరు రావడం పట్ల చిత్ర పరిశ్రమతోపాటు ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పెద్ద పండుగ వాతావరణమే ఉంటుందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.