ETV Bharat / entertainment

Mangalavaram Trailer : ఆసక్తి రేపుతున్న 'మంగళవారం' ట్రైలర్.. ఆ ఊర్లో వరుస హత్యకు గల కారణం ఏంటంటే ? - పాయల్ రాజ్​పుత్ మంగళవారం మూవీ అప్​డేట్స్

Mangalavaram Trailer : నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మంగళవారం'. 'ఆర్​ఎక్స్100' దర్శకుడు అజయ్‌ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మంగళవారం' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ వీడియో మీరూ చూసేయండి..

Mangalavaram Trailer : ఆ ఊర్లో వరుస హత్యకు గల కారణం.. ఆసక్తి రేపుతున్న 'మంగళవారం' ట్రైలర్

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 2:06 PM IST

Updated : Oct 21, 2023, 3:53 PM IST

Mangalavaram Trailer : 'ఆర్ఎక్స్100' దర్శకుడు అజయ్​ భూపతి-హీరోయిన్ పాయల్​ రాజ్​పుత్​ కలిసి చేస్తున్న తాజా చిత్రం 'మంగళవారం'. సస్పెన్స్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, టైటిల్​ అండ్​ ఫస్ట్​ లుక్ పోస్టర్​​తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేశారు.

ట్రైలర్​లో ఏం ఉందంటే.. ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లను ఓ అజ్ఞాతవాసి గోడపై రాస్తుంటాడు. ఆ గోడ మీద అలా రాస్తున్నదెవరు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రతి మంగళవారం ఊర్లో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ ట్రైలర్‌ సాగుతుంది. హత్య చేసిన ప్రతిసారి.. ఓ వ్యక్తి గోడపైన ఏదో రాసి పెట్టి ఉంచడం.. ఇక ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరు ? అటువంటి ప్రశ్నలతో ట్రైలర్‌ కట్ చేసిన తీరు ఆడియన్స్​ను ఆకట్టుకుంటోంది. అలా ఈ ట్రైలర్ మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో నింపేశారు దర్శకుడు. ఇక ట్రైలర్‌లో సినిమా స్టోరీని అంతగా రివీల్ చేయకుండా కొన్ని సీన్స్‌ను హైలైట్ చేస్తూ డైరెక్టర్ చూపించిన విధానం కూడా ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని.. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెరకెక్కించారు. నవంబర్ 17న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు 'కాంతార' ఫేమ్ అజనీశ్​ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.

ఈ ట్రైలర్​ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చిరంజీవి ఈ సినిమా సూపర్ హిట్​ సాధించాలని కోరుకుంటూ ఆల్​ ది బెస్ట్ చెప్పారు. అలానే సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునపాటి, సురేశ్​ వర్మ నాకు మంచి సన్నిహితులు అని ట్విట్​ చేశారు. ముఖ్యంగా స్వాతి రెడ్డి ఎంతో డైనమిక్​ అమ్మాయి అని.. యువత అందులోనూ యంగ్ మహిళలు సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లోకి వస్తుంటే నాకు ఎక్సైటింగ్​గా ఉంది అని తెలిపారు.

  • ‘మంగళవారం' సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా…

    — Chiranjeevi Konidela (@KChiruTweets) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Mangalavaaram Movie : 'గణ గణ మోగాలిరా'.. పాయల్ రాజ్​పుత్​ పవర్​ఫుల్​ సాంగ్​​​.. వింటే పూనకాలే

ఉత్కంఠగా పాయల్​ 'మంగళవారం' టీజర్​.. మ్యూజిక్ హైలైట్​

Last Updated : Oct 21, 2023, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.