ETV Bharat / entertainment

గుంటూరు కారంలో 'చెప్పవే చిరుగాలి' సాంగ్! మహేశే పాడారట! - గుంటూరు కారం చెప్పవేగ చిరుగాలి సాంగ్

Mahesh Babu Cheppave Chirugali Song : 'ఒక్కడు' సినిమాలోని చెప్పవే చిరుగాలి పాట మహేశ్ పాడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే జరుగుతుంది. గుంటూరు కారం మూవీలో మహేశ్ ఈ పాటను ఆలపించారట!

Mahesh Babu Cheppave Chirugali Song
Mahesh Babu Cheppave Chirugali Song
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 9:04 AM IST

Mahesh Babu Cheppave Chirugali Song : సూపర్​స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

2003లో విడుదలైన ఒక్కడు సినిమాలో 'చెప్పవే చిరుగాలి, చల్లగా ఎద గిల్లి, ఎక్కడే వసంతాల కేళి' అంటూ సాగే పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందించిన ఈ పాట మహేశ్ కెరీర్​లో వన్​ ఆఫ్​ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అప్పుడు ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయన్​ పాడిన ఈ పాటను మహేశ్​ ఇప్పడు పాడారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గుంటూరు కారం సినిమాలో హీరోయిన్​ శ్రీలీలను ఇంప్రెస్ చేయడానికి మహేశ్ ఈ చెప్పవే చిరుగాలి పాటను పాడారట. అయితే మొత్తం సాంగ్ కాదని, కేవలం ఫస్ట్ రెండు లైన్లను మహేశ్ తన స్టైల్​లో పాడినట్లు సమాచారం. ఈ సీన్​ను అభిమానులను తెగ ఆకట్టుకుంటుందట. త్రివిక్రమ్ కూడా సరైన మసాలా డోస్ ఇచ్చేలా ఆ సీన్ ను చిత్రీకరించారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్​లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మహేశ్​ బాబు, శ్రీలీల మధ్య ఓ మాస్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో మహేశ్, శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరీ లీడ్ రోల్ పోషిస్తోంది. సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, రఘబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్​పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 6వ తేదీన హైదరాబాద్​లో గ్రాండ్​ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని సినీ వర్గాల్లో టాక్. ఆ సమయంలో ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఘాటెక్కిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సాంగ్​ - 'దమ్‌ మసాలా బిర్యానీలా'

'ఓ మై బేబీ' సాంగ్ ఔట్- రిపీటెడ్ మోడ్​లో క్రేజీ మెలోడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.