'మహర్షి' చిత్రంలో రైతుగా నటించి మెప్పించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహర్షి'లో సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలో రైతుగా గురుస్వామి నటించారు. గురుస్వామితోనే కలిసి మహేశ్ సినిమాలో వ్యవసాయం చేస్తారు. మట్టి, రైతుల మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే సన్నివేశంలో గురుస్వామి నటన భావోద్వేగంగా సాగుతుంది.
గురుస్వామి కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత కొన్ని రోజులు కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేశారు. అయితే, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నటనవైపు వచ్చారు. విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి కొన్ని నాటకాలు వేశారు. 2019లో వచ్చిన 'మహర్షి'లో తెలుగు ప్రజలు గుర్తుండిపోయే పాత్రలో నటించారు. గురుస్వామి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: 'త్వరలో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తా.. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసింది!'
పదేళ్ల వివాహబంధానికి ముగింపు.. విడాకులు తీసుకున్న హనీసింగ్.. భరణమెంతో తెలుసా?