Lokesh Kanagaraj Leo movie : దర్శకుడు లోకేశ్ కనగరాజ్ అనగానే 'ఎల్సీయూ' (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) గుర్తుకొస్తుంది. ఆయన గత చిత్రాలు 'ఖైదీ', 'విక్రమ్' కూడా ఎల్సీయూ తరహాలోనే తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే దళపతి విజయ్ హీరోగా తాజాగా రిలీజైన 'లియో' సినిమా ఎల్సీయూలో భాగమే అని అందరూ అనుకున్నారు. అందుకోసం లియో చూసేందుకు వెళ్లే ముందు చాలా మంది 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలను చూసి మరీ వెళ్లారు. కానీ, ఈ చిత్రం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగము కాదని.. సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అయితే 'విక్రమ్', 'ఖైదీ' లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన లోకేశ్.. 'లియో' తో అంతగా ఆకట్టుకోలేకపోయాడని సినీప్రియులు అంటున్నారు.
'లియో' చిత్రం ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు మెప్పించింది. కానీ, సెకండాఫ్ మాత్రం ఆకట్టులేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. అలానే సినిమాలో కొన్ని పాత్రల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అని ఆడియోన్స్ అంటున్నారు. హీరోయిన్లు త్రిష, మడొన్నా సెబాస్టియన్, అంటోనియో దాస్, హరోల్డ్ దాస్ పాత్రలు.. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని ఫ్యాన్స్ అంటున్నారు. నటి ప్రియా ఆనంద్, అనురాగ్ కశ్యప్ పాత్రలు పరిధి మేరకే ఉన్నాయి. సంజయ్‌దత్, అర్జున్ ప్రాతలకు ప్రాధాన్యం ఉన్నా.. ఈ రోల్స్‌ను ముగించిన తీరు ఏ మత్రాం సంతృప్తికరంగా అనిపించలేదట. 'విక్రమ్' సినిమాలో లాగా విలన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించటంలో లోకేశ్ విఫలమైయ్యాడని ఇన్సైడ్ టాక్.
-
When Vikram meets #Leo 😂 pic.twitter.com/Gt75ZhzDSS
— Kettavan Memes (@Kettavan__Memes) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">When Vikram meets #Leo 😂 pic.twitter.com/Gt75ZhzDSS
— Kettavan Memes (@Kettavan__Memes) October 22, 2023When Vikram meets #Leo 😂 pic.twitter.com/Gt75ZhzDSS
— Kettavan Memes (@Kettavan__Memes) October 22, 2023
-
How many times have you guys watched #Leo? #LeoIndustryHit pic.twitter.com/CWKYnItowl
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">How many times have you guys watched #Leo? #LeoIndustryHit pic.twitter.com/CWKYnItowl
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) October 22, 2023How many times have you guys watched #Leo? #LeoIndustryHit pic.twitter.com/CWKYnItowl
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) October 22, 2023
సాధారణంగా లోకేశ్ లాంటి సస్సెస్ఫుల్ దర్శకుల సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. 'విక్రమ్', 'ఖైదీ' లాంటి సినిమాలు తెరకెక్కించిన లోకేశ్.. 'లియో' సినిమాలో తన మార్క్ చూపలేదట. లోకేశ్ కనగరాజ్ - విజయ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడం వల్ల ఫ్యాన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని సినీప్రియులు అంటన్నారు. ఇక సినిమా రిలీజ్ రోజు నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ, కలెక్షన్స్ విషయంలో వరల్డ్ వైడ్‌గా ఏ మాత్రం తగ్గకుండా జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Leo Movie Day 3 Collections : విజయ్ సంచలనం.. మూడు రోజుల్లోనే రూ.200కోట్లకు పైగా!
Leo Villain : ఏంటి.. 'లియో'లో విలన్ స్టార్ కొరియోగ్రాఫరా?.. భయపెట్టేశాడుగా!