ETV Bharat / entertainment

'లైగర్'​ షాకింగ్​ పోస్టర్​.. బోల్డ్​ లుక్​లో విజయ్​దేవరకొండ - vijay devarkonda nude poster

VijayDevarkonda Sexiest poster: లైగర్ మూవీటీమ్​ ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్​​ ఇచ్చింది. విజయ్​దేవరకొండకు సంబంధించిన ఓ షాకింగ్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. నెట్టింట్లో ఈ పోస్టర్​ తెగ ట్రెండ్​ అవుతోంది.

vijay devarkonda bold look
విజయ్​దేవరకొండ బోల్డ్​ లుక్​
author img

By

Published : Jul 2, 2022, 10:30 AM IST

Updated : Jul 2, 2022, 11:58 AM IST

vijay devarkonda bold look: విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్‌'. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీటీమ్​ ఓ సర్​ప్రైజ్​ ఇచ్చింది. విజయ్​కు సంబంధించి ఓ షాకింగ్ పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులో విజయ్​.. కండలు తిరిగిన దేహంతో బోల్డ్​ లుక్​లో రోజాపూలు పట్టుకుని నిలబడి ఉన్నాడు. "రక్తం, చెమట, మనసు, ప్రాణం... అన్నింటినీ తీసుకొస్తున్నాం.. ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​లో విజయ్ దేవరకొండను మీ ముందుకు తీసుకొస్తున్నాం" అని క్యాప్షన్​ జోడించింది. ఈ పోస్టర్​ విజయ్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకోగా.. మిగతావారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. 'సెక్సియస్ట్​ పోస్టర్'​, 'బోల్డ్​ క్యారెక్టర్​ చేసే నటులు అరుదుగా ఉంటారు. అప్పట్లో ఆమిర్​ఖాన్​, రణ్​బీర్​కపూర్ ఇలాంటి పాత్రలను చేశా'రంటూ గుర్తుచేసుకుంటున్నారు.

కాగా, ఈ సినిమాలో విజయ్‌ మిక్స్డ్‌మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆ విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కఠిన కసరత్తులు చేసి సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లోకి మారారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కేచ- స్టంట్స్‌, జునైద్‌ సిద్ధిఖీ-కూర్పు, విష్ణు శర్మ-ఛాయాగ్రహణం అందించారు.

vijay devarkonda bold look
విజయ్​దేవరకొండ బోల్డ్​ లుక్​

ఇదీ చూడండి: నరేశ్​-పవిత్ర బంధం.. మధ్యలో ట్విస్ట్​.. అసలేం జరుగుతోంది?

Last Updated : Jul 2, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.