ETV Bharat / entertainment

Leo Movie Day 3 Collections : విజయ్​ సంచలనం.. మూడు రోజుల్లోనే రూ.200కోట్లకు పైగా! - లియో మూడీ డే 3 కలెక్షన్స్

Leo Movie Day 3 Collections : దళపతి విజయ్​- లోకేశ్​ కనగరాజు కాంబోలో తెరకెక్కిన గ్యాంగస్టర్​ మూవీ 'లియో'... కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మూడో రోజు కలెక్షన్స్ రిపోర్ట్​ వచ్చింది! రెండో కాస్త తగ్గినా మూడో రోజు మళ్లీ పుంజుకుంది.

Leo Movie Day 3 Collections : విజయ్​ సంచలనం.. మూడో రోజు దూకుడు..  రూ.200కోట్లకు పైగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 10:37 AM IST

Leo Movie Day 3 Collections : కోలీవుడ్ స్టార్​ దళపతి విజయ్ - దర్శకుడు లోకేశ్​ కనగరాజ్ కాంబినేషన్​లో భారీ యాక్షన్​ గ్యాంగ్​స్టర్​ మూవీ 'లియో'. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్ల దగ్గర దూసుకెళ్తోంది. భారీ అంచనాలతో అక్టోబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డీసెంట్​ రెస్పాన్స్​తో రన్​ అవుతోంది. ఈ చిత్రం తొలి రోజే వరల్డ్ వైడ్​గా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్​ను సాధించగా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయింది. మళ్లీ మూడో రోజు పుంజుకుంది. మూడో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 39.09 శాతం, మ్యాట్నీ షో ఆక్యూపెన్సీ 63.70శాతం, ఫస్ట్ షో​ ఆక్యూపెన్సీ 56.55 శాతం, సెకండ్​ షో​ ఆక్యూపెన్సీ 69.41 శాతం నమోదయ్యాయని తెలిసింది.

కలెక్షన్స్ వివరాల విషయానికొస్తే.. 'లియో' ఇప్పటికే రూ.100కోట్ల క్లబ్​లోకి ఎంటర్​ అయిపోయింది. మూడో రోజు ఇండియాలో రూ.40కోట్ల నెట్​ వసూలు చేసిందని తెలిసింది. తొలి రోజు రూ.64కోట్లు అందుకోగా.. రెండో రోజు కాస్త రూ.35.25కోట్లతో కాస్త డ్రాప్ అయింది. మూడో రోజు మళ్లీ కాస్త పుంజుకుంది. మొత్తంగా ఇండియా వైడ్​గా రూ.140కోట్ల నెట్​ కలెక్షన్లను సాధించింది. ఇక ఈరోజు(అక్టోబర్ 22) ఆదివారం వీకెండ్ కాబట్టి.. దేశవ్యాప్తంగా కాస్త ఎక్కువ వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రూ.200కోట్ల మార్క్​ను అందుకుంటుందని ఆశిస్తున్నారు.

గ్రాస్ వసూళ్ల విషయానికొస్తే.. మూడో రోజు రూ.47కోట్లు వచ్చాయట. తమిళనాడు రూ.26కోట్లు, కేరళ రూ.7కోట్లు, ఏపీ-తెలంగాణ రూ.5కోట్లు, కర్ణాటక రూ.5.50కోట్లు, రెస్ట్​ ఆఫ్ ఇండియా రూ.3.50కోట్లు సాధించిందట. ఇక వరల్డ్​ వైడ్​గా మొత్తంగా రూ.200కోట్లకు పైగా వసూళ్లను సాధించిందని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి.

సినిమా రివ్యూ విషయానికొస్తే(Leo Movie Review).. విజ‌య్ న‌ట‌న‌, ఫ్లాష్‌బ్యాక్‌లో ఫైట్‌ సీన్స్‌, విరామ స‌న్నివేశాలు బలాలుగా నిలిచాయి. ద్వితీయార్ధం కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్​, హైనాతో ఫైట్ సీక్వెన్స్‌ బ‌ల‌హీన‌త‌లుగా ఉన్నాయి. మొత్తంగా యాక్ష‌న్ ప్రియుల్ని మెప్పించే లియో అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్​గా నటించగా.. మడొన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్ సర్జా కీలక పాత్రల్లో నటించారు.

Bhagavanth Kesari Day 3 Collections : బాక్సాఫీస్​ ముందు అంతా బాలయ్య సౌండే.. అప్పుడే అన్ని కోట్లా!

Tiger Nageswara Rao Day 2 Collections : బాలయ్య కన్నా కాస్త తక్కువ.. అయినా మంచిగానే వసూల్​.. ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.