ETV Bharat / entertainment

మహేశ్, జక్కన్న చిత్రం.. తెలుగు, ఇంగ్లిష్​లో ఒకేసారి షూటింగ్!.. రిలీజ్ డేట్ ఇదే! - రాజమౌళి కొత్త సినిమా

రాజమౌళి-మహేశ్​ బాబు కలయికలో వస్తున్న సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఇటీవల రాజమౌళి.. తన తర్వాతి సినిమాపై ఓ అప్డేట్ ఇచ్చారు. తాజాగా, ఈ చిత్ర రిలీజ్ డేట్, షూటింగ్​కు సంబంధించి నెట్టింట్లో కొత్త కథనాలు ప్రచారం అవుతున్నాయి. అవేంటంటే?

rajamouli mahesh bab
latest update about heroine in rajamouli mahesh babu movie
author img

By

Published : Sep 17, 2022, 2:11 PM IST

ఆర్​ఆర్​ఆర్​తో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి.. మహేష్​ బాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే దానికి సంబంధించిన అప్డేట్​ కూడా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు అవకాశం ఉన్న ఈ సినిమా.. భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడి చుట్టూ సినిమా ఉండబోతుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి తాజాగా మరిన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ చిత్రాలతో హాలీవుడ్​లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ చిత్రానికి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టును గ్లోబల్ లెవెల్​లో తీర్చిదిద్దే అవకాశం ఉందని సమాచారం. మహేశ్​తో తీసే చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లిష్​లోనూ ఏకకాలంలో షూటింగ్​ చేస్తారంటూ సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దసరాలోగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్​ నుంచి రెగ్యులర్​ ఘాటింగ్​ చేయనున్నారని తెలుస్తోంది. 2024 సమ్మర్​ కానుకగా సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్​ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఇంతవరకు హీరోయిన్ ఎంపిక చేయలేదు. అయితే బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక ఇదివరకే 'ఎక్స్​ఎక్స్​ఎక్స్​: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' అనే హాలీవుడ్​ చిత్రంలో నటించింది. దీంతో ఆమె సినిమాలో ఉండటం కొంత హెల్ప్​ అవుతుందని చిత్ర యూనిట్​.. దీపికను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మహేశ్​ బాబు.. త్రివిక్రమ్​ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ చిత్ర షూటింగ్ అయిపోయిన వెంటనే.. ఈ షూటింగ్​లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఇవీ చదవండి: ఏఆర్​ రెహమాన్​ కాన్సర్ట్​.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి అనౌన్స్​మెంట్..!

'టైటానిక్' గురించి ఈ విశేషాలు మీకు తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.