king of kotha teaser : 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత 'మహానటి'తో గుర్తింపు తెచ్చుకుని ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నారు. అనంతరం గతేడాది 'సీతారామం'తో ఆడియెన్స్‌లో మరింత పాపులారిటినీ పెంచుకున్నారు.. రామ్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా దర్శకుడు అభిలాష్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం.. 'కింగ్ ఆఫ్ కోత'. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖ హీరోలు (తెలుగులో మహేశ్‌బాబు) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు.
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా.. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే దుల్కర్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడీ ఈ టీజర్ మరింత అంచనాలను పెంచింది. రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే సంభాషణలతో ప్రారంభమైంది ఈ ప్రచారం చిత్రం. తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెబుతూ సాగే ఈ ప్రచార చిత్రం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో దుల్కర్ యాక్టింగ్ అదిరిపోయింది. మొత్తంగా ఒకటిన్నర నిమిషాలు ఉన్న సాగిన ఈ టీజర్.. గ్యాంగ్‍స్టర్లు, యాక్షన్ సన్నివేశాలు, పోలీసులతో చాలా ఆసక్తికరంగా ఉంది.
మ్యూజిక్ హైలైట్.. ఇంకా ఈ టీజర్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్‍గా ఉంది. ఈ చిత్రానికి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. నిమిశ్ రవి సినిమాటోగ్రఫీ కూడా చూడటానికి చాలా బాగుంది. 1980-90ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక నిర్మాణ విలువలు కూడా బాగా ఉన్నాయని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.
ఓనమ్ కానుకగా... ఈ సినిమాను వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుల్కర్, ఐశ్వర్య లక్ష్మీతో పాటు నైలా ఉషా, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, చెంబన్ వినోద్, వడా చెన్నై శరన్, శాంతి కృష్ణ, అనిఖా సురేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఓనమ్ 2023 కానుకగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి :
దుల్కర్ సల్మాన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మరో తెలుగు సినిమాకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్.. ఈ సారి వెంకీ అట్లూరీతో