Yash New film updates: సాధారణంగా స్టార్ హీరోలు.. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెట్టేస్తుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్ని చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంటారు. ఏదైనా సినిమా సూపర్ హిట్ అయినా.. ఇక ఆ హీరోతో పనిచేసేందుకు దర్శక నిర్మాతల క్యూ కడుతుంటారు. అందులో తమకు నచ్చిన సబ్జెక్ట్‌ను ఎంచుకుని కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తుంటారు హీరోలు.
కానీ ఈ ఏడాది 'కేజీయఫ్ 2'తో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ మాత్రం ఇంతవరకూ ఏ ప్రాజెక్ట్‌నూ అనౌన్స్ చేయలేదు. 2015లో ఈ ప్రాజెక్టును ఒప్పుకున్నప్పటి నుంచి పూర్తి ఫోకస్ దీని మీదే పెట్టారు. తొలి భాగం తర్వాత 'కేజీయఫ్ 2' ఉండటం వల్ల మరో సినిమాను యశ్ ప్రకటించలేదని అంతా అనుకున్నారు. అయితే రెండో భాగం సూపర్ హిట్ అయిన తర్వాత కూడా ఏలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఆ మధ్యలో ఓ కన్నడ దర్శకుడితో యశ్ మూవీ చేస్తారని వినిపించినా.. ఆ తర్వాత దాని ప్రస్తావన బయటకు రాలేదు. కనీసం ఎటువంటి గాసిప్స్, సమాచారం కూడా తెలియలేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అలానే రాకింగ్ స్టార్ ఎలాంటి చిత్రంతో ముందుకు వస్తారనే ఉత్సుకతోనూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
'కేజీయఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన నేపథ్యంలో మంచి సబ్జెక్టుల్ని ఎంపిక చేయాలని యశ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఎలాంటి సినిమాతో వస్తారో? ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
ఇదీ చూడండి: బాలయ్యకు విలన్‌గా ప్రముఖ హీరోయిన్.. శివకార్తికేయన్‌కు జోడీగా కియారా!