ETV Bharat / entertainment

'కేజీఎఫ్​ 2' కోసం తీవ్రంగా శ్రమించిన కెమెరామెన్స్.. వీడియో వైరల్​!

KGF 2 Making Video: ప్రస్తుతం సినిమా కబుర్లు చెప్పుకొనే ఏ ఇద్దరి నోట విన్నా 'కేజీఎఫ్‌2' సంగతులే. రాఖీభాయ్‌గా యశ్ నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఇక, తెరపై కనిపించిన ఆ అద్భుతాన్ని సృష్టించేందుకు తెర వెనుక పడిన కష్టం అంతా ఇంతా కాదని డీవోపీ టీమ్​ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధంచిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

kgf 2 making video
kgf 2 making video
author img

By

Published : Apr 29, 2022, 5:22 PM IST

KGF 2 Making Video: 'కేజీఎఫ్​ ఛాప్టర్‌ 2'.. సినీ ప్రియులందరి నోట ఇప్పుడిదే మాట వినిపిస్తోంది. కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం అన్ని భాషల వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని ప్రతి ఫ్రేమ్‌ అద్భుతమనిపించింది. తెరపై కనిపించిన ఆ అద్భుతాన్ని సృష్టించేందుకు చిత్ర బృందం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని సెట్స్‌, వందలమంది నటులను కెమెరాలో బంధించేందుకు తామెంత కష్టపడ్డామో ఛాయాగ్రాహకుల బృందం చెప్పుకొచ్చింది.

"ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబినేషన్‌కు తిరుగులేదు. సినిమానే వారి ప్రపంచం. ఒక్కోసారి.. నిర్విరామంగా 12 గంటలు పనిచేసేవాళ్లం. 10 రోజులు అనుకున్న షెడ్యూల్‌ 8 రోజులకే ముగిసేది. నరాచీ నేపథ్యంలో వందల మంది కనిపించే సీన్లు, కార్ల బ్లాస్టింగ్‌ సన్నివేశాలను ఓ సవాలుగా స్వీకరించాం. సెట్స్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాతతర్వాత ఇష్టం పెరిగింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నిషియన్‌ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. భారతీయ సినీ అభిమానులకు మంచి చిత్రాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరం ఆసక్తిగా పనిచేశాం. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎంతో ఆనందాన్ని పొందాం" అని డీవోపీ టీమ్‌ తెలిపింది.

ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'కేజీఎఫ్​ 1'కు కొనసాగింపుగా రూపొందిన 'కేజీఎఫ్‌ 2' ఇప్పటి వరకూ రూ. 920 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అతి త్వరలోనే రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ ఈ సీక్వెల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రవి బస్రూర్‌ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. 'కేజీఎఫ్‌' తెర వెనక ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: Acharya Movie Review: 'ఆచార్య' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.