ETV Bharat / entertainment

అక్కినేని హీరోకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన సమంత.. రిప్లై వస్తుందా? - happy birthday akhil akkineni

టాలీవుడ్​​ హీరో అక్కినేని అఖిల్​ బర్త్​డే విషెస్​ చెప్పింది హీరోయిన్​ సమంత. మరి అఖిల్.. ​ ఆమెకు రిప్లై ఇస్తాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

samantha-wishes-akhil-akkineni-his-29th-birthday-

author img

By

Published : Apr 8, 2023, 11:55 AM IST

Updated : Apr 8, 2023, 2:42 PM IST

ఏప్రిల్​ 8 టాలీవుడ్​​ హీరో అక్కినేని అఖిల్​ బర్త్​డే. ఈ సందర్భంగా​ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ యంగ్​ హీరోకు అభిమానులు, ప్రముఖులు విషెస్​ తెలుపుతున్నారు. అయితే ఇదంతా కామనే అయినప్పటికీ ఓ వ్యక్తి చేసిన విష్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఇంకెవరిదో కాదు టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంతది. అక్కినేని ఇంటి మాజీ కోడలైన ఈ తార.. అఖిల్​కు బర్త్​డే విషస్​ చెప్పింది.

అఖిల్ నటిస్తున్న ఏజెంట్​ సినిమా పోస్టర్​ను ఇన్​స్టాలో పోస్ట్ చేసి.. దానికి 'హ్యాపీ బర్తడే అఖిల్​.. ఏజెంట్​ ఆన్​ ఏప్రిల్​ 28.. దిజ్​ ఈజ్​ గోయింగ్​ టు బి ఫైర్​.. లాట్స్​ ఆఫ్​ లవ్​ అంటూ క్యాప్షన్​ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్​ నెట్టింట వైరల్​ అవుతోంది. అయితే నాగచైతన్యతో విడిపోయినా కూడా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది అన్న విషయం ఈ ఒక్క పోస్ట్​తో నిరూపితమయ్యిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే గతేడాది కూడా అఖిల్​ బర్త్​డేకు సామ్‌ విష్​ చేసినా.. అఫీషియల్​గా అయితే అఖిల్‌ స్పందించినట్లు కనిపించలేదు. పర్సనల్‌గా థాంక్యూ చెప్పుండచ్చని అభిమానులు అంటున్నారు. మరి ఈ సారైనా అఖిల్​ అఫీషియల్​గా స్పందిస్తారా లేదా అని ఎదురుచూస్తున్నారు.

samantha-wishes-akhil-akkineni-his-29th-birthday-
సమంత ఇన్​స్టా పోస్ట్​

అఖిల్​తోనే కాకుండా అక్కినేని హీరో అయిన సుశాంత్‌ సినిమాలకు కూడా సామ్‌ తన బెస్ట్‌ విషెస్‌ను తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్​లు పెడుతుంటారు. మరోవైపు అటు దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా, మిహిక, వెంకటేశ్‌ కూతురు అశ్రితలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం సమంత శాకుంతలం ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగుల్లో పాల్గొంటున్నారు.

అక్కినేని అఖిల్​ కూడా తన అప్​కమింగ్​ మూవీ ఏజెంట్​ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్​ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. మలయాళ హీరో మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 28న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'ఏజెంట్‌' విశేషాలపై అఖిల్‌ను యాంకర్‌ సుమ ఇంటర్వ్యూ చేసింది. శనివారం అఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇంటర్వ్యూ రిలీజ్‌ అవ్వనుంది. అందులో అఖిల్..​ సుమతో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ వైరలవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Apr 8, 2023, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.