ETV Bharat / entertainment

'మీడియా పేరుతో ఆమె బెదిరించింది.. బాధ కాస్తా భయంగా మారింది!' - vishwak sen news

ఒక సినిమా విషయంలో ఓ అమ్మాయి మీడియా పేరుతో బెదిరించిందని చెప్పారు హీరో విశ్వక్​సేన్​. ఆ బాధ కాస్త భయంగా మారిందని కూడా తెలిపాడు. అసలు ఏమైంది విశ్వక్​సేన్​కు? ఎవరు బెదిరించారు?

media arguement
media arguement
author img

By

Published : May 2, 2022, 5:11 PM IST

ALi Tho Saradaga Vishwak Sen: 'వెళ్లిపోమాకే' అంటూ చిత్రసీమలో కథానాయకుడిగా అడుగుపెట్టి 'ఈ నగరానికి ఏమైంది?' అంటూ ఆకట్టుకుని సందడి చేసిన యువ హీరో విశ్వక్‌సేన్‌. 'ఫలక్‌నుమా దాస్‌'తో మాస్‌ ఆడియన్స్‌కు దగ్గరై హైదరాబాద్‌ పొగరును చూపించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ 'హిట్‌: ది ఫస్ట్ కేస్‌'లో విక్రమ్‌ రుద్రరాజుగా మెప్పించారు. ఇటీవలే అతడు నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస చిత్రాలతో అలరిస్తున్న విశ్వక్‌.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఇటీవల అతిథిగా విచ్చేశారు. ఒక సినిమా విషయంలో ఓ అమ్మాయి మీడియా పేరు చెప్పి బెదిరించిందని, ఆ బాధ భయంగా మారిన సందర్భాన్ని విశ్వక్ సేన్​​ గుర్తు చేసుకున్నారు.

"ఓ సారి రామానాయుడు స్టూడియోలో ఏదో పని ఉండి అక్కడికి వెళ్లా. అక్కడ నాకొక స్నేహితుడు ఉన్నాడు. 'తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో మెయిన్‌ లీడ్‌ ఇంకా ఓకే కాలేదు. వెళ్లి ఆడిషన్‌ ఇవ్వచ్చుకదా' అన్నాడు. అప్పటికే నేను మూడు నెలల నుంచి ఆడిషన్స్‌కు వెళ్లలేదు.హీరో రోల్స్‌కి ఫిక్స్ అయి ఉంటారులే అనుకున్నా. కొత్తవాడిని తీసుకొచ్చి మనల్ని మెయిన్‌ లీడ్‌లో పెట్టి సినిమా ఎవరు తీస్తారనుకున్నా. అతను నా ఫోటోను తీసి వెంటనే తరుణ్‌ భాస్కర్‌కు పంపిస్తే 'అరె.. ఈ అబ్బాయి కోసం నేను రెండు నెలల నుంచి వెతుకుతున్నా.. పిలువు' అన్నాడు. 'ఫలక్‌నుమాదాస్‌ సినిమా తీస్తున్నావంట కదా' అన్నారు. 'అవును నేనే నిర్మాతని. మీరు సినిమా ఛాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని అన్నాను. వెంటనే తరుణ్‌ పది నిమిషాల్లో కథ చెప్పేసి, చేతిలో స్టోరీ పెట్టారు. తర్వాత కథ మొత్తం చదివా. ఆ సినిమానే 'ఈ నగరానికి ఏమైంది'.

అయితే కొన్ని రోజులకే ఫోన్‌ వచ్చింది. 'సారీ మీరు సెలక్ట్‌ కాలేదు. కారణాలు ఏంటి అనేది అడగొద్దని' అని చెప్పారు. మళ్లీ బాధపడ్డా. కానీ, మూడో రోజూ నాకు.. ఎవరో అమ్మాయి నా గురించి మెయిల్‌ పెట్టింది. 'వీడు నా సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాలాంటి పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రావద్దు. వీడిని మీ సినిమాలో పెట్టుకుంటే మీ ఇష్టం. నేను చెప్పిన తర్వాత మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' దాని సారాంశం. ఆ బాధ కాస్త నాకు భయంగా మారింది."

- విశ్వక్​ సేన్​, నటుడు

"సినిమా అవకాశం ఈరోజు కాకపోతే రెండురోజులకో, పదిరోజులకో సంపాదించుకుంటా. దీనివల్ల వారం రోజుల పాటు నాకు నిద్ర రాలేదు. తరుణ్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి ఆ మెయిల్ చేసిన అమ్మాయి ఎవరో చెప్పండి. నేను నిజం తేల్చుకుంటా అనగానే.. అతడు నన్ను నమ్మారు. 'నాక్కూడా ఎందుకో డౌట్‌ వస్తోంది విశ్వక్‌. మెయిల్ పంపిస్తున్నా చూడు' అని మెయిల్ చేశాడు. ఆ మెయిల్‌ పంపించిన అమ్మాయి అసలు ఆ మెయిలే పంపలేదు. 2, 3 సంవత్సరాల క్రితం ఏదో మ్యూజిక్‌ కాన్సెప్ట్ అప్పుడు జరిగిన గొడవలో ఓ ఫ్రెండ్‌ని నేను కొట్టా. ఇదంతా అతడే చేశాడు.

అతడు బాగా చదువుకున్నవాడు. తర్వాత వాడి తప్పును వాడే ఒప్పుకునేలా చేసి అప్పటికప్పుడు సురేశ్​ బా​బుగారి దగ్గరకు తీసుకెళ్లి విషయం చెప్పించాం. తర్వాత ఆయన ఓకే చేసి తరుణ్‌ భాస్కర్‌ దగ్గరకు పంపారు. వెంటనే తరుణ్ నన్ను కౌగిలించుకొన్నారు. తరుణ్‌ నా మీద నమ్మకం పెట్టుకొని మెయిల్ పంపించడం వల్ల అసలు విషయం బయటపడింది. లేకపోతే ఆ మచ్చ నాకు అలానే ఉండిపోయేది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది తరుణ్‌ భాస్కర్‌కే" అని విశ్వక్​ సేన్​ చెప్పుకొచ్చాడు.

విజయ్​ని అనలేదు!.. 'ఫలక్​నుమా దాస్​' విడుదల సమయంలో తనకు మధ్య విజయ్​ దేవరకొండ ఫ్యాన్స్​ మధ్య జరిగిన గొడవ​ గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో స్పష్టత ఇచ్చారు. అయితే ఆ విషయంలో విజయ్​ ఫ్యాన్స్​ తనను అపార్థం చేసుకున్నారని తెలిపారు. 'ఫలక్​నుమా దాస్​' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​లో.."నన్ను ఒకడు లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటా?" అని తాను​ అన్న మాట విజయ్​ దేవరకొండను ఉద్దేశించి కాదని తెలిపాడు. అయితే తామిద్దరి మధ్య స్నేహం, శత్రుత్వం రెండూ లేవని విశ్వక్​సేన్​ చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: 'సర్కారు వారి 'ట్రైలర్'' వచ్చేసింది.. మహేశ్​కు మరో మాస్ హిట్!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.