Kamal Hasan Health Condition: విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో చెన్నై పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో ఆయన చేరారు. జ్వరంతో ఇబ్బంది పడడం వల్ల ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం కమల్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎవరూ ఆందోళను చెందద్దొని చెబుతున్నారు.
అయితే బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కమల్ హాసన్.. అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి కలిశారు. 'విక్రమ్'తో ఇటీవలే విజయాన్ని అందుకున్న కమల్‌హాసన్.. ప్రస్తుతం 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్ పరంగా జోరు మీదున్న ఆయన తన గురువు కె.విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకున్నారు. కె.విశ్వనాథ్, కమల్‌హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే 'సాగర సంగమం', 'శుభ సంకల్పం' చిత్రాలొచ్చాయి. తరచూ తన గురువు కె.విశ్వనాథ్‌ను కలిసి ఆయనతో కాసేపు సమయం గడుపుతుంటారు కమల్‌హాసన్.