ETV Bharat / entertainment

అల్లు అర్జున్​ క్రేజ్​ తగ్గేదేలే​, 7 మిలియన్ల ఫాలోవర్లతో - అల్లుఅర్జున్​ ట్విట్టర్​ ఫాలోవర్లు

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్​​ అల్లు అర్జున్. తాజాగా ఆయన ట్విట్టర్​లో 7 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్నారు.

alluarjun got 7 million followers in social media twitter

author img

By

Published : Aug 17, 2022, 12:32 PM IST

Allu Arjun Twitter Followers: 'పుష్ప' సినిమా తర్వాత ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పాపులారిటీ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. తన నటనతో టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ట్విట్టర్​లో ఆయన 7 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్​ చేశారు అల్లు అర్జున్​. మరో సోషల్​ మీడియా దిగ్గజం ఇన్​స్టాగ్రామ్​లో బన్నీకి 18 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

alluarjun got 7 million followers in social media twitter
హీరో అల్లు అర్జున్​ ట్వీట్​

'పుష్ప' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీ ప్రేమికుల​ను విపరీతంగా ఆకట్టుకున్నారు. శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్.. తన నటనతో అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్​గా నటించిన రష్మిక కూడా తన నటనతో ఫేమస్​ అయ్యారు. 'గంగోత్రి' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్​.. ఆ తర్వాత 'బన్నీ', 'దేశముదురు', 'పరుగు', 'సరైనోడు', 'అల వైకుంఠపురములో' లాంటి సినిమాలతో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' షూటింగ్​కు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి: స్పెయిన్​లో నయన్​ విఘ్నేశ్​ వెకేషన్​​, ఆ మూడు కొత్త అనుభవాలే అంటూ

పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ బ్యూటీ, ఎంగేజ్​మెంట్ పిక్స్​ వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.