ETV Bharat / entertainment

నాగార్జునకు ఆ తేదీ అంటే వెరీ స్పెషల్​, ఎందుకో తెలుసా

'శివ'గా సైకిల్‌ చైన్‌ తెంచి, టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించారు. 'అభిరామ్‌'గా అమ్మాయిలపై అసహ్యం వ్యక్తం చేస్తూ నవ్వులు పంచారు. 'ప్రకాశ్‌'గా ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. 'గణేశ్‌'గా 'మాస్‌' అనే పదానికి అసలైన అర్థమిచ్చారు. అలాంటి ఆయన 'అన్నమాచార్య', 'కంచెర్ల గోపన్న', 'శిరిడి సాయి'గా కనిపించి ఔరా అనిపించారు. సుమారు 36 ఏళ్లుగా విభిన్న పాత్రలతో సాహసాలు చేస్తున్న ఆ 'కింగ్‌' ఎవరో కాదు అక్కినేని నాగార్జున. సోమవారం 63వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంటున్న సందర్భంగా ఈ 'గ్రీకువీరుడు' గురించి కొన్ని విశేషాలు.

Happy Birthday Nagarjuna
నాగార్జున బర్త్​డే
author img

By

Published : Aug 29, 2022, 10:18 AM IST

సైకిల్‌ చైన్‌ తెంచి టాలీవుడ్‌ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. 'హలో గురు ప్రేమకోసమే' అని పాడుకుంటూ హీరోయిన్‌ వెంటపడితే ప్రేక్షకులూ గంతులేశారు. మా..మా.. మాస్ అంటూ చొక్కా మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. క్యాన్సర్‌ బాధితుడిగా 'గీతాంజలి'లో చూపించిన విషాదానికి సినిమా హాళ్లు కన్నీళ్లతో తడిశాయి. 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు' సినిమాలకి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది తెలుగు సినీ లోకం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ 'కింగ్‌'గా సాగిపోతున్నారాయన. ఇవాళ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

siva
శివ
  • సుమారు 8 నెలల వయసున్నప్పుడే నాగార్జున తెరపై కనిపించారు. ఆ సినిమా ఏదోకాదు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘వెలుగు నీడలు’. తర్వాత, ‘సుడిగుండాలు’తో బాల నటుడిగా మారారు. 1986లో ‘విక్రమ్‌’తో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగార్జున ప్రయాణమేంటో అందరికీ తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లు, మాస్‌, క్లాస్‌.. ఇలా అన్ని నేపథ్యాలను టచ్‌ చేసి మెప్పించారు.
  • ‘త్రిమూర్తులు’, ‘రావుగారి ఇల్లు’, ‘ఘటోత్కచుడు’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘స్టైల్‌’, ‘తకిట తకిట’, ‘దొంగాట’, ‘అఖిల్‌’, ‘సైజ్‌జీరో’, ‘ప్రేమమ్‌’ సినిమాల్లో అతిథి పాత్రలు పోషించి, కనువిందు చేశారు. హిందీ, తమిళ సినిమాల్లోనూ నాగ్‌ నటించారు.
  • కొత్త ప్రతిభను ప్రోత్సహించటంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా తన 36 ఏళ్ల కెరీర్‌లో సుమారు 40మంది కొత్త దర్శకులను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆ క్రమంలో వచ్చినవే ‘శివ’, ‘మాస్‌’, ‘వైల్డ్‌డాగ్‌’ తదితర చిత్రాలు. ‘‘కొత్తవారు దర్శకత్వం వహిస్తే సినిమాకి కొత్తదనం వస్తుంది. నా పాత్రలూ కొత్తగా ఉంటాయి. నటనలో వైవిధ్యం కనిపిస్తుంది. గతంలో పోషించిన పాత్రల పేరు మార్చి, దుస్తులు మార్చి ఏదో కొత్తగా చేశాం అని అనిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందుకే నూతన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటా. ఆ క్రమంలో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాల్నీ అందుకున్నా. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ని అయ్యానంటే కారణం కొత్త దర్శకులు, వారి ఆలోచనల వల్లే’’ అని అంటుంటారు నాగార్జున.
  • ఒకే ఏడాదిలో ‘గ్రీకువీరుడు’లా సాఫ్ట్‌గా కనిపించటం, దైవత్వం నిండిన ‘జగద్గురు ఆది శంకర’లో కీ రోల్ ప్లే చేయటం, ‘భాయ్‌’గా కొత్త లుక్‌ సెట్‌ చేయటం ఆయనకే చెల్లింది. ‘ఒక్కడే దేవుడు’, ‘డిక్క డిక్క డుం డుం’, ‘కొత్త కొత్త భాష’, ‘లడ్డుండా’ పాటలతో గాయకుడిగానూ నాగార్జున ఉర్రూతలూగించారు.
  • సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై కథాబలం ఉన్న చిన్న సినిమాలను ఆయన నిర్మిస్తుంటారు. ‘ఉయ్యాలా జంపాలా’, ‘నిర్మలా కాన్వెంట్‌’, ‘రంగుల రాట్నం’ తదితర చిత్రాలు అలా రూపొందినవే.
Happy Birthday Nagarjuna
నాగార్జున బర్త్​డే

ఇతర హీరోలతో కలిసి నాగ్‌ నటించిన చిత్రాలు కెప్టెన్‌ నాగార్జున, అరణ్య కాండ (రాజేంద్ర ప్రసాద్‌), కిరాయి దాదా, సిద్ధార్థ (కృష్ణంరాజు), ప్రేమయుద్ధం, అధిపతి (మోహన్‌బాబు), వారసుడు, రాముడొచ్చాడు (కృష్ణ), సీతారామరాజు (హరికృష్ణ), రావోయి చందమామ (జగపతిబాబు), కృష్ణార్జున (మంచు విష్ణు), ఊపిరి (కార్తి), దేవదాస్‌ (నాని). మహేశ్‌బాబుతో నటించేందుకూ సిద్ధమే అని నాగ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఇటీవల తన మనసులో మాట పంచుకున్నారు. దానికి మహేశ్‌బాబూ సుముఖత వ్యక్తం చేశారు. దాంతో, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెప్పుడెక్కుతుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తన కుటుంబంతో కలిసి నాగ్‌ నటించిన సినిమాలు కలెక్టర్‌గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే, శ్రీరామదాసు (నాగేశ్వరరావు), స్నేహమంటే ఇదేరా (సుమంత్‌), మనం (నాగేశ్వరరావు, నాగచైతన్య, అఖిల్‌), బంగార్రాజు (నాగచైతన్య). అటు తండ్రి, ఇటు తనయులతో కలిసి నటించిన అరుదైన అవకాశం టాలీవుడ్‌లో నాగార్జునకే దక్కిందని చెప్పొచ్చు. ‘మనం’లో అక్కినేని మూడు తరాల హీరోలు కనిపించి, ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచారు.

నాగ్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘విక్రమ్‌’, తండ్రీకొడుకులతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘మనం’.. ఈ రెండూ మే 23నే విడుదలయ్యాయి. అందుకే ఆ తేదీ అంటే తనకెంతో ప్రత్యేకమంటారు నాగార్జున.

Happy Birthday Nagarjuna
మనం

'బాస్‌'గా వెండితెరపైనే కాదు ‘బిగ్‌బాస్‌’ హెస్ట్‌గానూ బుల్లితెరపై తనదైన ముద్ర వేశారాయన. వరుసగా మూడు సీజన్ల (బిగ్‌బాస్‌ 3,4,5)కు బిగ్‌బాస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో రక్తి కట్టించారు. ‘ఓటీటీ బిగ్‌బాస్‌’లోనూ హోస్ట్‌గా సందడి చేశారు. త్వరలోనే ‘బిగ్‌బాస్‌ 6’తో అలరించనున్నారు. గతంలో, తాను నిర్మించిన ‘యువ’ అనే సీరియల్‌లో మెరిసి ఆకట్టుకున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే కార్యక్రమానికి నాగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ ఏడాది జనవరిలో 'బంగార్రాజు'గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున త్వరలోనే ‘ది ఘోస్ట్‌’ అనే సినిమాతో రాబోతున్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. నాగ్‌ కీలక పాత్ర పోషించిన ‘బ్రహ్మాస్త్రం-1’ సెప్టెంబరు 9న రిలీజ్‌ అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్ హీరోగా నటించిన సినిమా ఇది. నాగ్‌ ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.

ఇదీ చూడండి: లెహంగాలో మలైకా, మృణాల్​ సోయగాలు చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.