Guntur Kaaram Naga Vamsi : 2024 సంక్రాంతి సినిమాల్లో ఒకటిగా వస్తోంది సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
గుంటూరు కారం మూవీలో చివరి 45 నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటుందని నాగవంశీ తెలిపారు. "ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు అద్భుతం. మొత్తం ఫైట్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, కుర్చీ మడతపెట్టి సాంగ్‌తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. గుంటూరు కారంతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం. థియేటర్ల సంగతి నేను చూసుకుంటాను. సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే బాధ్యత అభిమానులదే" అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ప్రతి ఏరియాలో రాజమౌళి సినిమా నంబర్లకు దగ్గరగా వెళ్తున్నామని తెలిపారు నాగ వంశీ. గతంలో అలావైకుంఠపురంలో మూవీతోనూ ఇలాగే దగ్గరగా వెళ్లామని, ఇప్పుడు గుంటూరు కారంతో మరో భారీ హిట్ కొట్టబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు ఉన్న థియేటర్ల సమస్య జనవరి 7 లేదా 8వతేదీలోగా ఓ కొలిక్కి వస్తుందని కూడా నాగవంశీ తెలిపాడు.
గుంటూరు కారం కేవలం తెలుగులోనే రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు జనవరి 12వ తేదీన అన్ని థియేటర్స్ ఆ సినిమాకే వెళ్లనున్నాయట. అయితే హనుమాన్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ ఉండటంతో ఆ 10 శాతం థియేటర్స్ దానికి కేటాయిస్తారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మహేశ్ గట్టిగానే ఓపెనింగ్స్ కొడతారన్నమాట.
మహేశ్ బాబు గత సినిమా సర్కారు వారు పాట ఎలాంటి పండగ లేనప్పుడే, సమ్మర్ సీజన్లో వచ్చి ఓపెనింగ్ రోజు రూ.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పుడు గుంటూరు కారం సంక్రాంతి పండగకి వచ్చి, ఇన్ని థియేటర్స్ దొరుకుతుంటే ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్స్ రోల్స్‌లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
గుంటూరు కారంలో 'చెప్పవే చిరుగాలి' సాంగ్! మహేశే పాడారట!
ట్రెండ్ సెట్టర్ మహేశ్- యూఎస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్- సినీ చరిత్రలో తొలిసారి!