Actors Turned Directors : ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఆన్‌స్క్రీన్‌పై తమ నటనతో అలరిస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రం మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గానూ మారిన సందర్భాలున్నాయి. ఓ హీరోగా తెరపై తమను చూపించినట్లే.. ఓ దర్శకుడిగా తమ దృష్టికోణాన్ని ప్రేక్షకులకు చూపిస్తుంటారు. అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు ఎందరో స్టార్స్ అప్పుడప్పుడు రచయితలుగా, దర్శకులుగా మారిన వారు ఉన్నారు. అయితే ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో ఉంటూ డైరెక్షన్‌ను మరిచిపోయిన ఈ తారలు.. చాలా గ్యాప్ తర్వాత మరోసారి యాక్షన్ అంటూ మెగాఫోన్‌లో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ వారెవరంటే..
Dhanush Directed Movies : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం వరుస సినిమాల షూట్లతో బిజీగా ఉన్నారు. ఇక తన బిజీ షెడ్యూల్లోనే తన 50వ సినిమా కోసం ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. 'పా. పాండి' (2017) సినిమాతో తొలిసారిగా దర్శకుడైన ధనుశ్.. దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడయ్యారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను ఆయన తెరకెక్కించనున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్, అనిఖా సురేంద్రన్, ఎస్‌జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
-
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
Upendra Directed Movies : కన్నడ నటుడు ఉపేంద్రకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఓ నటుడిగానే కాదు ఓ దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేశారు. 'ష్..! (1993)', 'ఓం (1995)', 'ఉపేంద్ర (1999)' లాంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చినవే. ఇందులో ఆయన నటించారు కూడా. ఇక శాండల్‌వుడ్‌లో సూపర్‌హిట్ అయిన ఈ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ 2015లో వచ్చిన 'ఉప్పి 2' తర్వాత దర్శకత్వానికి కొంచం బ్రేక్ ఇచ్చారు. ఇక ఏడేళ్ల తర్వాత 2022లో 'యూఐ' అనే సినిమా తెరకెక్కించనున్నారు.
-
In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT
— Upendra (@nimmaupendra) March 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT
— Upendra (@nimmaupendra) March 11, 2022In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT
— Upendra (@nimmaupendra) March 11, 2022
Sudeep Directed Movies : 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ హీరో సుదీప్లోనూ ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఆరు సినిమాలను తెరకెక్కించారు. 'మై ఆటోగ్రాఫ్' (2006), 'మాణిక్య (2014)' లాంటి సూపర్ హిట్ సినిమాలను రూపొందిచారు. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ... 2024లో సుదీప్ మరోసారి మెగాఫోన్ పట్టనున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 'కేకే' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Farhan Akhtar Directed Movies : 'దిల్ చాహ్ తా హై' (2001) అనే సినిమాతో చిత్రంతో రచయితగా, దర్శకుడిగా తన కెరీర్ ఆరంభించారు బాలీవుడ్ స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్. 'డాన్: ది చేజ్ బిగిన్స్', 'డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్' సినిమాలను తెరకెక్కించిన ఆయన.. దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి మార్కులు కొట్టేశారు. నటుడిగా కాస్త బిజీ అయ్యాక.. ఫర్హాన్ మరో సినిమాను తెరకెక్కించలేదు.
అయితే పదేళ్ల తర్వాత 2021లో 'జి లే జరా' అనే సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ఫర్హాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇప్పుడు 'డాన్ 3' సినిమాను ప్రకటించారు ఫర్హాన్. రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.