ETV Bharat / entertainment

NTR‏ను ఇంట్లో పిలిచే ముద్దు పేరేంటో తెలుసా?.. తారక్ మాత్రం కాదు! - junior ntr updates

టాలీవుడ్​ స్టార్​ హీరో జూనియర్​ ఎన్టీఆర్​ను చాలా మంది ఫ్యాన్స్​ తారక్ అని పిలుచుకుంటారు. అయితే ఆయనను ఇంట్లో పిలిచే ముద్దు పేరేంటో తెలుసా?

do you know hero junior ntr nick name
do you know hero junior ntr nick name
author img

By

Published : Jan 18, 2023, 4:54 PM IST

జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తారక్. కేవలం భారతీయులే కాదు.. విదేశాల్లోనూ ఎన్టీఆర్‏కు వీరాభిమానులు ఉన్నారు. కేవలం నటనలోనే కాదు ప్రవర్తనలోనూ తారక్ కాస్త ప్రత్యేకమనే చొప్పొచ్చు.

తాజాగా తారక్​కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదే ఎన్టీఆర్ ముద్దు పేరు. అభిమానులంతా తారక్​​ను యంగ్ టైగర్ అంటూ పిలుచుకుంటారు. మరికొందరు తారక్ అని పిలుస్తుంటారు. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్​ను సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, నిర్మాతలు అందరూ తారక్ అనే పిలుస్తారు. కానీ ఇంట్లో ఆయనను ఏమని పిలుస్తారో తెలుసా?

గతంలో ఓ షో ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ .. తనను ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా ఓ పేరు అనేది లేదని అన్నారు. "ఇంట్లో మా అమ్మగారు ఓ పేరు పెట్టి పిలుస్తారు.. పలుకుతాను.. అలాగే నా భార్య లక్ష్మి ప్రణతి ముద్దుగా ఓ పేరు పెట్టి పిలుస్తుంది పలుకుతాను.. మా పిల్లలు నాన్న అని పిలుస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా.. తారక్ అన్నా.. రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా ఎలా పిలిచిన నాకు ఓకే.. ఇలాగే పిలవండి అని ఎప్పుడూ చెప్పను" అని అన్నారు.
ఇటీవలే 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో సత్తా చాటిన ఎన్టీఆర్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.