- పంజాగుట్ట శ్మశాన వాటికలో ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు
LIVE UPDATES: ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు - undefined
15:24 February 03
14:22 February 03
కొనసాగుతున్న దర్శకుడు విశ్వనాథ్ అంతిమయాత్ర
- కొనసాగుతున్న దర్శకుడు విశ్వనాథ్ అంతిమయాత్ర
- ఫిల్మ్ నగర్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర
- కాసేపట్లో పంజాగుట్ట శ్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు
12:47 February 03
ఆ సమయంలో ఎన్నో విషయాలు నేర్పారు: వెంకటేశ్
- ఆ సమయంలో ఎన్నో విషయాలు నేర్పారు: వెంకటేశ్
- ‘‘లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్‌గారు లేరంటే నిజంగా షాకింగ్‌గా ఉంది. దేశంలో ఉన్న గొప్ప దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ‘స్వర్ణకమలం’ సినిమా సందర్భంగా ఎన్నో విషయాలు నేర్పారు. ఈ జనరేషన్ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలు కూడా ఆయన సినిమాను గుర్తు పెట్టుకుంటాయి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
12:18 February 03
ఆయనకు వినోదం అందించేందుకు విశ్వనాథ్ వెళ్లారు: కోట శ్రీనివాసరావు
- ఆయనకు వినోదం అందించేందుకు విశ్వనాథ్ వెళ్లారు: కోట శ్రీనివాసరావు
- ‘‘విశ్వనాథ్‌గారి గురించి నా మనసులో ఉన్నది చెప్పాలంటే ‘విశ్వ దర్శకుడికి వినోదమందించ, విశ్వనాథుడేగే విశ్వపురికి’. అనిపిస్తోంది. శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి 2నే ఆయన శివుడి దగ్గరకు వెళ్లారు’’
12:18 February 03
దర్శకత్వం చేయకపోయినా మా కథలో నటించారు: పరుచూరి గోపాలకృష్ణ
- దర్శకత్వం చేయకపోయినా మా కథలో నటించారు: పరుచూరి గోపాలకృష్ణ
- ‘‘ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే ఆయన కన్నుమూయడం చూస్తే, ఒక గొప్ప సినిమాను మనకు అందించి సంతృప్తితో వెళ్లిపోయారనిపించింది. ఆయనతో సినిమా చేయాలని రెండు, మూడు సార్లు కథ వినిపించా. మా ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు వేరు. మేము రాసిన కథలకు ఆయన దర్శకత్వం వహించకపోయినా, నటించారు. ‘నరసింహనాయుడు’లో ఆయన పాత్రను జీవితంలో మర్చిపోలేం. ఆ సినిమా స్క్రీన్‌ప్లే విషయంలోనూ పలు సలహాలు ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి కన్నుమూడం నిజంగా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
12:17 February 03
కె.విశ్వనాథ్ మృతి చెందారన్న వార్త నన్నెంతో బాధించింది: ఇళయరాజా
- కె.విశ్వనాథ్ మృతి చెందారన్న వార్త నన్నెంతో బాధించింది: ఇళయరాజా
- ‘‘ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో గొప్ప దర్శకుడిగా కీర్తిని పొందిన కె.విశ్వనాథ్‌గారు కన్నుమూశారన్న వార్త నన్ను ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తున్నా’’
12:16 February 03
కె.విశ్వనాథ్ గొప్ప విజనరీ డైరెక్టర్: గుణశేఖర్
- కె.విశ్వనాథ్ గొప్ప విజనరీ డైరెక్టర్: గుణశేఖర్
- ‘‘మాటలు కనపడాలి’ అన్న దర్శకత్వ ప్రాథమిక సూత్రం ఆయన సినిమాల్లో ప్రస్పుటంగా కనిపిస్తుంది. మాలాంటి వాళ్ల మీద ఆయన ప్రభావం బాగా ఉంది. సినిమా ఒక గొప్ప కళ అని ఆయన నిరూపించారు. ఆయన ఎప్పుడూ మన మధ్య సజీవంగా ఉంటారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పుస్తకం. శంకరాభరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. చూసిన ప్రతిసారి దాని దృక్కోణం మారిపోతుంది. ఎంతో లోతుగా మహాసముద్రంలా కనిపిస్తుంది. ప్రతి తరం దర్శకులకు అది స్ఫూర్తి. ఆయన గొప్ప విజనరీ డైరెక్టర్’’
12:15 February 03
చిన్న వయసులోనే సినిమా చేసే భాగ్యం నాకు కలిగింది: అల్లు అరవింద్
- చిన్న వయసులోనే సినిమా చేసే భాగ్యం నాకు కలిగింది: అల్లు అరవింద్
- ‘‘చిన్న వయసులోనే ఆయనతో సినిమా చేసే భాగ్యం నాకు కలిగింది. షూటింగ్ సమయంలో నన్ను పిలిచి చాలా విషయాలు చర్చించేవారు. అంతకుముందెప్పుడూ అలా ఎవరితోనూ చర్చించలేదని జంథ్యాల ఆశ్చర్యపోతూ నాతో చెప్పారు. ఒక సీన్‌లో మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సరిగా చేయలేకపోతున్నారు. నలుగురు వ్యక్తులు కనపడే ఆ సన్నివేశాన్ని విశ్వనాథ్‌గారు అన్ని పాత్రల్లోనూ నటించి చూపించారు. చిరంజీవిగారితో ఆయనకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఎక్కడున్నా చిత్ర పరిశ్రమను దీవించాలని కోరుకుంటున్నా’’
11:50 February 03
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆర్. నారాయణమూర్తి, చంద్రమోహన్
11:49 February 03
విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన వెంకయ్య నాయుడు
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన వెంకయ్య నాయుడు
- విశ్వనాథ్ పరమపదించడం చాలా విచారకరం: వెంకయ్యనాయుడు
- సమాజంలో మార్పును కోరుకుంటూ ఎన్నో సినిమాలు తీశారు: వెంకయ్య
11:28 February 03
విశ్వనాథ్ లేరనే వార్త బాధకు గురిచేసింది: చిరంజీవి
- విశ్వనాథ్ లేరనే వార్త బాధకు గురిచేసింది: చిరంజీవి
- విశ్వనాథ్ చిత్రాలు మనకు ఉండటం అదృష్టంగా భావించాలి: చిరంజీవి
- తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు: చిరంజీవి
- విశ్వనాథ్ దర్శకత్వంలో నేను నటించడం అదృష్టం: చిరంజీవి
10:14 February 03
విశ్వనాథ్ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
- విశ్వనాథ్ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
- విశ్వనాథ్ మృతిచెందడం బాధాకరం: ప్రధాని మోదీ
- విశ్వనాథ్ సృజనాత్మక బహుముఖ దర్శకుడు: ప్రధాని మోదీ
- సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు: ప్రధాని మోదీ
- విశ్వనాథ్ సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయి: ప్రధాని మోదీ
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోదీ
10:13 February 03
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి, వెంకటేశ్
- విశ్వనాథ్ పార్థవదేహానికి నివాళులర్పించిన రాజమౌళి, కీరవాణి
- విశ్వనాథ్ పార్థవదేహానికి నివాళులర్పించిన బ్రహ్మానందం
09:59 February 03
కళ బతికున్నంత కాలం విశ్వనాథ్ మనతోనే ఉంటారు: బ్రహ్మానందం
- విశ్వనాథ్.. భారత చలనచిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం: బ్రహ్మానందం
- సువర్ణ కమలం కావున శాశ్వతంగా ఉంటుంది: బ్రహ్మానందం
- కళ బతికున్నంత కాలం విశ్వనాథ్ మనతోనే ఉంటారు: బ్రహ్మానందం
- విశ్వనాథ్ దర్శకత్వంలో 2 సినిమాల్లో నటించాను: బ్రహ్మానందం
- విశ్వనాథ్ కుటుంబాన్ని కలిసినపుడు సరదాగా గడిపేవాళ్లం: బ్రహ్మానందం
- విశ్వనాథ్‌తో ఎన్నో మధురక్షణాలు కలిసి పంచుకున్నా: బ్రహ్మానందం
09:58 February 03
సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది:నాజర్
- విశ్వనాథ్.. యువతరానికి ఆదర్శంగా ఉంటారు:నాజర్
- విశ్వనాథ్.. తెలుగు దర్శకుడే కాదు.. భారతీయ దర్శకుడు:నాజర్
- సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది:నాజర్
09:57 February 03
యావత్ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది: తలసాని
- యావత్ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది: తలసాని
- కళలు, సామాజిక స్పృహ ఉన్న గొప్ప వ్యక్తి విశ్వనాథ్: తలసాని
- ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్: తలసాని
- 'శంకరాభరణం' చిత్రం ప్రతి ఒక్కరినీ కదిలించింది: తలసాని
- విశ్వనాథ్‌ను అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి: తలసాని
- సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలు తీశారు: తలసాని
09:55 February 03
విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- నివాళులర్పించిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, అశ్వనీదత్
- నివాళులర్పించిన వెంకటేశ్, సాయికుమార్, రాజశేఖర్, మురళీమోహన్
- నివాళులర్పించిన కోట శ్రీనివాస్, తనికెళ్ల భరణి, చంద్రబోస్
09:54 February 03
బాపు, బాలచంద్ర, విశ్వనాథ్ వంటి వారు చరిత్రకారులు: రాఘవేంద్రరావు
- విశ్వనాథ్.. సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు: రాఘవేంద్రరావు
- బాపు, బాలచంద్ర, విశ్వనాథ్ వంటి వారు చరిత్రకారులు: రాఘవేంద్రరావు
09:44 February 03
ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల గవర్నర్ సంతాపం
- ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల గవర్నర్ సంతాపం
- విశ్వనాథ్ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది: గవర్నర్ తమిళిసై
09:44 February 03
ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల నందమూరి రామకృష్ణ సంతాపం
- ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల నందమూరి రామకృష్ణ సంతాపం
- విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు: రామకృష్ణ
09:31 February 03
ఉదయం 11 గం.కు విశ్వనాథ్ అంతిమయాత్ర: ఏడిద రాజా
- ఉదయం 11 గం.కు విశ్వనాథ్ అంతిమయాత్ర: ఏడిద రాజా
- పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు: ఏడిద రాజా
09:25 February 03
- విశ్వనాథ్ మృతి సంతాపంగా చిత్ర పరిశ్రమకు సెలవు: సి.కల్యాణ్
09:24 February 03
విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్
- విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్
- నాకు సినిమాలు అంటే తెలియని సమయంలో విశ్వనాథ్ సినిమా పాటలే: పవన్
- ఎక్కువగా యాక్షన్ సినిమాలు ఇష్టపడే నాకు స్వాతిముత్యం, శంకరాభరణం లాంటి సినిమాలు తెలుగు సినిమా, సాహిత్యం, మన సాంస్కృతి పై విలువలు తెలిసేలా చేశాయి: పవన్
09:22 February 03
- విశ్వనాథ్ ముగింపు కాదు. కలవారసత్వం కొనసాగింపుకి ప్రారంభం: త్రివిక్రమ్ శ్రీనివాస్
- నాకు వ్యక్తిగతంగా విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం:వెంకటేశ్
08:58 February 03
మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
- మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
- ‘‘సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ గారు, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి.’’
08:57 February 03
భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయింది: గవర్నర్ తమిళిసై
- భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయింది: గవర్నర్ తమిళిసై
- కళాతపస్వి విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయిందని తమిళిసై పేర్కొన్నారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి క్లాసిక్ చిత్రాలు రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
08:51 February 03
విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: పవన్ కల్యాణ్
- విశ్వనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: పవన్ కల్యాణ్
- నా చిన్నప్పుడు సంస్కృతి, సంగీతం గురించి తెలియదు: పవన్ కల్యాణ్
- మన సంస్కృతి, కర్ణాటక సంగీతం ఇంత గొప్పగా ఉంటదని తెలియదు: పవన్ కల్యాణ్
- 'శంకరాభరణం' సినిమా పాటల ద్వారా గొప్పదనం తెలిసింది: పవన్ కల్యాణ్
- నా చిన్నతనంలో 'శంకరాభరణం' సినిమా నన్ను హత్తుకుపోయింది: పవన్ కల్యాణ్
- ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయి: పవన్ కల్యాణ్
- విశ్వనాథ్ పార్థివదేహానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సత్యానంద్ నివాళులు
08:50 February 03
కళాతపస్వి విశ్వనాథ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు
- కళాతపస్వి విశ్వనాథ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు
- బాపట్ల జిల్లా: భట్టిప్రోలు మం. పెదపులివర్రులో విషాదఛాయలు
- విశ్వనాథ్, నేను చిన్నప్పుడు బాగా స్నేహంగా ఉండేవాళ్లం: విశ్వనాథ్ స్నేహితుడు
- విశ్వనాథ్ కుటుంబం పెదపులివర్రులో పదేళ్లపాటు నివాసం ఉంది: సుబ్బారావు
- పదేళ్ల తర్వాత విశ్వనాథ్ కుటుంబం విజయవాడ వెళ్లిపోయింది: సుబ్బారావు
- విజయవాడలో పరిచయాల ద్వారా సినిమాల్లోకి వెళ్లారు: సుబ్బారావు
- దర్శకుడు అయ్యాక విశ్వనాథ్ కొన్నిసార్లు పెదపులివర్రు వచ్చారు: సుబ్బారావు
08:50 February 03
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపట్ల మంత్రుల సంతాపం
- ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపట్ల మంత్రుల సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
08:49 February 03
కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల కమల్‌హాసన్ సంతాపం
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల కమల్‌హాసన్ సంతాపం
- కళ అమరత్వాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు: కమల్‌హాసన్
- విశ్వనాథ్ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది: కమల్‌హాసన్
- విశ్వనాథ్‌కు వీరాభిమాని అంటూ ట్వీట్ చేసిన కమల్‌హాసన్
08:25 February 03
విశ్వనాథ్ మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది: బాలకృష్ణ
- కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ: బాలకృష్ణ
- ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటు: బాలకృష్ణ
- విశ్వనాథ్ ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం: బాలకృష్ణ
- మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటారు: బాలకృష్ణ
- విశ్వనాథ్ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి: బాలకృష్ణ
- ఆయన సినిమాలు కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటాయి: బాలకృష్ణ
- విశ్వనాథ్ మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది: బాలకృష్ణ
08:22 February 03
విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
- నివాళులర్పించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, తనికెళ్ల భరిణి
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన వెంకటేశ్, బ్రహ్మాజీ
- విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన గుణశేఖర్, మణిశర్మ
08:21 February 03
ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం
- ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కిషన్‌రెడ్డి
08:09 February 03
- ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా: అనిల్‌కపూర్
08:08 February 03
ఇది అత్యంత విషాదకరమైన రోజు: చిరంజీవి
- ఇది అత్యంత విషాదకరమైన రోజు: చిరంజీవి
- ‘‘పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిల్మ్స్‌ని కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైంది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్‌లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్‌లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనది. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
08:07 February 03
నాకు స్ఫూర్తినింపిన వాళ్లలో ఆయన ఒకరు: క్రిష్
- నాకు స్ఫూర్తినింపిన వాళ్లలో ఆయన ఒకరు: క్రిష్
- ‘‘లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి నన్ను తీవ్రంగా కలిచి వేసింది. సినిమాపై ఆయనకున్న ప్యాషన్, కథను చెప్పే విధానం, పని పట్ల నిబద్ధత నాలాంటి ఎంతోమంది సినీ దర్శకులకు స్ఫూర్తి’’
08:06 February 03
విశ్వనాథ్ మృతిపట్ల సోము వీర్రాజు సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల సోము వీర్రాజు సంతాపం
- విశ్వనాథ్ మరణం కళాభిమానులకు తీరని లోటు: సోము వీర్రాజు
- విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా: సోము వీర్రాజు
08:04 February 03
విశ్వనాథ్ మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం
- విశ్వనాథ్ మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం
- తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్: బండి
- విశ్వనాథ్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు: బండి సంజయ్
07:44 February 03
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల రేవంత్‌రెడ్డి సంతాపం
- అనేక చారిత్రాత్మక, సందేశాత్మక చిత్రాలు అందించిన దర్శకులు విశ్వనాథ్: రేవంత్
- విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: రేవంత్
07:44 February 03
- విశ్వనాథ్ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- తెలుగు సినిమా స్థాయిని విశ్వనాథ్ పెంచారు: వెంకయ్య
- మన ఖ్యాతిని విశ్వనాథ్ విశ్వవ్యాప్తం చేశారు: వెంకయ్య
- విశ్వనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా: వెంకయ్య
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: వెంకయ్య
07:44 February 03
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
- కళాఖండాల్లాంటి చిత్రాలను విశ్వనాథ్ అందించారు: చంద్రబాబు
- విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు
- విశ్వనాథ్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు: చంద్రబాబు
07:44 February 03
- దర్శకుడు విశ్వనాథ్ మృతిపట్ల నారా లోకేశ్ సంతాపం
- విశ్వనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్
07:43 February 03
- కె.విశ్వనాథ్ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
- విశ్వనాథ్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
07:43 February 03
- కె.విశ్వనాథ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి
- విశ్వనాథ్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
07:42 February 03
కె. విశ్వనాథ్(92) కన్నుమూత
- హైదరాబాద్: కళాతపస్వి కె. విశ్వనాథ్(92) కన్నుమూత
- జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్
- విశ్వనాథ్ పార్థివదేహం ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలింపు
- శంకరాభరణం విడుదలైన రోజే విశ్వనాథ్ శివైక్యం
- ఐదు దశాబాద్దాల పాటు తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన కె.విశ్వనాథ్