Brahmanandam Second Son Marriage Photos : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు, సినీ ప్రియులు 'హాస్య బ్రహ్మ' అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం మే నెలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వివాహ వేడుక కూడా గ్రాండ్‌గా జరిగింది. ఆయన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను వివాహమాడారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుక జరిగింది.
ఈ పెళ్లి వేడుకకు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ పెద్దలు చాలా మంది విచ్చేసి నూతన వధూవరులను(Brahmanandam Second Son Wedding) ఆశీర్వదించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటులు నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరై సందడి చేశారు. ఇకపోతే నూతన పెళ్లి కొడుకు సిద్ధార్థ్ విషయానికొస్తే.. ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడినట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య కూడా డాక్టరేనట. గైనకాలజీ చేసిందని తెలిసింది.
-
Natasimham #NandamuriBalakrishna, Power Star @PawanKalyan and Mega power star @AlwaysRamCharan attended comedy king #Brahmanandam son's marriage. 🤩❤️❤️ pic.twitter.com/ivSSfrrwZX
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Natasimham #NandamuriBalakrishna, Power Star @PawanKalyan and Mega power star @AlwaysRamCharan attended comedy king #Brahmanandam son's marriage. 🤩❤️❤️ pic.twitter.com/ivSSfrrwZX
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 18, 2023Natasimham #NandamuriBalakrishna, Power Star @PawanKalyan and Mega power star @AlwaysRamCharan attended comedy king #Brahmanandam son's marriage. 🤩❤️❤️ pic.twitter.com/ivSSfrrwZX
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 18, 2023
Brahmanandam First Son Movies : బ్రహ్మీ మొదటి కొడుకు గౌతమ్ విషయానికొస్తే.. ఆయన పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. పల్లకిలో పెళ్లి కూతురు, చారుశీల, మను, బసంతి వంటి సినిమాలు చేశారు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ఆ మధ్యలో ఓ సినిమా ప్రకటించారు కానీ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. ఇక బ్రహ్మీ గురించి తెలిసిందే. ఆ మధ్యలో కాస్త జోరు తగ్గించిన ఈయన.. 'రంగమార్తాండ' సినిమా నుంచి మళ్లీ జోరు పెంచారు. వరుసగా సినిమాల్లో కనిపిస్తున్నారు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బ్రో' కనిపించారు. ప్రస్తుతం 'కీడా కోలా', 'గుంటూరు కారం' సినిమాల్లో నటిస్తున్నారు.
మహేశ్ కోరిక మేరకు 8 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రహ్మీ అలా!
కామెడీ కింగ్ బ్రహ్మీ.. లెక్చరర్ నుంచి గిన్నిస్ రికార్డు వరకు