Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : సినిమాలు అంటే సాంగ్స్, యాక్షన్ సీన్స్‌తో పాటు పవర్ఫుల్ డైలాగ్స్‌కు పెట్టింది పేరు. ఇక నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్ ఆన్ యాక్షన్ సీన్స్ + ఎమోషనల్ డైలాగ్స్.. ఇది బాలయ్య మార్క్ సినిమాలు. చిన్న పిల్లాడి నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరి నోట్లో అవి నానుతూనే ఉంటాయి. డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఫ్లూట్ జింక ముండు ఊదు సింహం ముందు కాదు, దబిడి దిబిడి లాంటి డైలాగ్స్ అయితే మనం ఇప్పటికీ రోజూ వింటుంటాం. అవి ఎంత పాపులర్ అంటే కొన్ని సినిమాల్లో వాటిని విరివిగా వాడిన సందర్భాలున్నాయి. 'వీరసింహారెడ్డి'తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు 'భగవంత్ కేసరి'గా మన ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమాలో తొలిసారిగా ఆయన తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా అవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అవేంటో మీరు కూడా ఓ సారి చూసేయండి..
- నువ్ ఏడనున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడే దునియా నీకు బాంచన్ అంటది.
- ఆర్మీ ఈజ్ నాట్ ఏ ఆక్యుపేషన్.. ఇట్ ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్
- బిడ్డనైతే విడిసిపెట్ట బతిమిలాడుతా.. బుజ్జగిస్తా, అవసరం అయితే కాళ్లు పట్టుంకుంటా రా భాయ్ ! బిడ్డని స్ట్రాంగ్ చెయ్యాలి. షేర్ లెక్క.
- లేసిన నోరు ఏమందో తేలియాలి, మిమల్ని పంపిన కొడుకెవడో తెలియాలి.
- ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు, నను కొట్టే బలవంతుణ్ణి ఆ భగవంతుడు కూడా తేలేడు.
- దేవుడు ఎవర్రా ? దేవుడు ఎవరు ? బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే దేవుడు లెక్క!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Tiger Nageswara Rao Dialogues : ఇక 'భగవంత్ కేసరి' విడుదలైన మరుసటి రోజు( అక్టోబర్ 20)న థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజ 'టైగర్ నాగేశ్వరరావు' ముందుకొస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమాలో కూడా కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అవేంటంటే?
- దొంగతనానికి కొన్ని సార్లు ధైర్యం ఒక్కటే చాలదు. తెలివితేటలు కూడా కావాలి
- కొట్టే ముందు.. కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు
- రేపటి నుంచి స్టువర్ట్పురంలో దేవుడి పాట నాదే.. చెప్పాడికి
- స్టువర్ట్పురం నాగేశ్వర రావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది.
Bhagvant Kesari Kajal Agarwal : బాలయ్యపై కాజల్ అగర్వాల్ కామెంట్స్.. అలాంటివి లెక్కచేయదట!