ETV Bharat / entertainment

చిరంజీవి ఫ్యామిలీతో గొడవ.. అసలేం జరిగిందో చెప్పిన అల్లు అరవింద్​

మెగాఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య మనస్పర్థలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై స్పందించారు ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​. అసలేం జరిగిందో తెలిపారు.

chiranjeevi alluarvind
చిరంజీవి అల్లుఅరవింద్ గొడవ
author img

By

Published : Oct 11, 2022, 10:06 AM IST

Updated : Oct 12, 2022, 6:29 AM IST

మెగాఫ్యామిలీతో గొడవపై స్పందించిన అల్లుఅరవింద్​

మెగాఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య మనస్పర్థలు, భేదాభిప్రాయాలు ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​ దానిపై స్పష్టతనిచ్చారు.

"ఇది చాలా సహజం. సమాజంలో ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మేమిద్దరం బావబామరిది కన్నా బాగా దగ్గరి స్నేహితులుగా ఉన్నాం. అలాగే ఎదిగాం. అలానే మా కుటుంబాలు కూడా ఎదిగాయి. పిల్లలు పుట్టారు. వారు ఇదే వృత్తిలో ఉన్నారు. మనకున్నది చిన్న ఫిల్మ్​ సొసైటీ. అందుబాటులో ఉన్న అవకాశాలను వీళ్లు పంచుకోవాలి. అటువంటప్పుడు పోటీ ఉంటుంది. అలా వీరు ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంలో ప్రజలు ఇలా రూమర్స్​ మాట్లాడుకోవడం సహజమే గానీ వారు గ్రహించాల్సిందేమిటంటే వీళ్లంతా ఒకటేనని. ఉదాహరణకు అల్లు రామలింగయ్య శతజయంతికి రెండు కుటుంబాలు కలిసి సెలబ్రేట్​ చేసుకున్నాయి. మేము సంక్రాంతికి చిరు ఇంట్లో పండగ చేసుకుంటాం. దీపావళికి వారు మా ఇంటికి వచ్చేస్తారు. ఇది ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలకి తెలియాలి అని షూట్​ చేసి మీడియాలో పెట్టము కదా.

చిరంజీవిని తొలిసారి చలసాని గోపి ఆఫీస్​లో చూశాను. లోపల నుంచి ఒకాయన వచ్చాడు. ఎక్కడో చూసినట్టు అనిపించింది. అతనే చిరంజీవి. అప్పుడే కలిశాం. షేక్​ హ్యాండ్ ఇచ్చుకున్నాం. అప్పటి నుంచి ఆ చేతులు కలిసే ఉన్నాయి. అల్లుడు చేసుకోవాలనే ఆలోచన మా అమ్మది. మా అమ్మ హాలులో కూర్చుండగా బెల్లు మోగింది. ఆమె తలుపు తీసింది. ఎవరో ఒకాయన వచ్చి మా బంధువు గురించి అడిగారు. ఆయనే చిరంజీవి. మా ఇంటికి వచ్చి మా బంధువును కలిసి వెళ్లారు. అప్పుడు మా అమ్మ చిరంజీవి గురించి అడిగి తెలుసుకుంది. రాత్రి మా నాన్నగారు వచ్చాక.. అబ్బాయి బాగున్నాడు. మన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామా ఓ సారి ఆలోచించండి అని చెప్పింది. కానీ మా నాన్నేమో సినిమా వాళ్లు వద్దని అన్నారు. ఆ విషయం మా అమ్మ నాకు చెప్పింది. అయితే ఆ తర్వాత మా నాన్న చిరు గురించి ఆరా తీయడం ప్రారంభించారు. చివరికి చిరంజీవి మంచి వాడని తెలిసింది. డీవీ ఎస్​ రాజు మా నాన్న బాగా సన్నిహితంగా ఉండేవారు. చిరంజీవిని చేసుకోవడం కరెక్టా కాదా అని ఆయన్ను అడిగారు. 'ఆయన నువ్వు నీ కొడుకు కూడా సినిమా వాళ్లేగా? అని అన్నారు. అబ్బాయి మంచి వాడు అన్నావు కాబట్టి మాట్లాడి పెళ్లి చేయ్'​ అని నాన్నతో అన్నారు. అలా పెళ్లి సంబంధం సెట్​ అయింది" అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చిరు గాడ్​ఫాదర్​ను వీక్షించిన రజనీకాంత్​.. ఏం అన్నారంటే?

Last Updated : Oct 12, 2022, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.