'ఓరి దేవుడా' చిత్ర బృందం ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్‌ను వదిలింది. విష్వక్‌సేన్ కథానాయకుడిగా, తమిళంలో విజయవంతమైన 'ఓ మై కడవులే'కి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. మాతృకకి దర్శకత్వం వహించిన అశ్వథ్ మారిముత్తు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ తెరపై దేవుడిగా సందడి చేయనున్నాడు. ఈ మేరకు వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21న 'ఓడి దేవుడా' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది.
'పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి' అనేది పెద్దల మాట. అంటే మన భాగస్వామి ఎవరో ముందే రాసిపెట్టుంటుందన్న మాట. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రం రానుంది. విశ్వక్ సరసన మిథిలా పాల్కర్ నటిస్తోంది. 'మురంబ' అనే మరాఠీ చిత్రం, పలు వెబ్ సిరీస్‌లతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న పాల్కర్‌కు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: తరుణ్ భాస్కర్, కూర్పు: గ్యారీ బీహెచ్. విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ అని ఎందుకు మొరపెట్టుకున్నాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అదిరిపోయింది అంతే.. 'కృష్ణ వ్రింద విహారి' ప్రీ రిలీజ్ వేడుకలో తన మధుర గాత్రంతో పాట పాడి అలరించింది కథానాయిక షిర్లీ సేతియా. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు, తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానని తెలిపింది. ఈ సినిమాలోని వ్రింద అనే పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇందుకు తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది.
కాగా, నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై 'కృష్ణ వ్రింద విహారి' తెరకెక్కింది. షిర్లీ సేథియా కథానాయిక. ఉషా ముల్పూరి నిర్మాత. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పకులు. మహతి స్వరసాగర్ స్వరకర్త. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, కూర్పు: తమ్మిరాజు, కళ: రామ్ కుమార్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్స్ విమర్శలు.. స్పందించిన జక్కన్న