ETV Bharat / entertainment

ఇకపై అలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే: రష్మిక

ఇకపై 'ఆ' పాత్రల్లోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది హీరోయిన్​ రష్మిక. తన డ్రీమ్​ రోల్​ ఏంటో తెలిపింది. సీతారామం మూవీ తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. ఇంకా కెరీర్​ గురించి పలు విషయాలను తెలిపింది. ఆ సంగతులివీ..

Rashmika Sitaramam
రష్మిక సీతారామం
author img

By

Published : Aug 9, 2022, 6:28 AM IST

Updated : Aug 9, 2022, 7:06 AM IST

ఓ వైపు స్టార్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూనే 'సీతారామం'లో కీలక పాత్ర పోషించి, మంచి విజయం అందుకున్నారు రష్మిక . దుల్కర్‌ సల్మాన్‌ , మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో రష్మిక.. ఆఫ్రిన్‌ అనే క్యారెక్టర్‌లో కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కిన నేపథ్యంలో రష్మిక మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..

మీ పాత్రకు విశేష ప్రేక్షకాదరణ దక్కుతుందని ముందే ఊహించారా?
రష్మిక: ఆఫ్రిన్‌ పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడు హను రాఘవపూడి నాకు వివరించినప్పుడే అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. ‘సీతారామం’ చిత్ర బృందం సుమారు రెండేళ్లు కష్టపడింది. దానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు అందించారు. ఈ సినిమా, నా పాత్రకు దక్కిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
ఆఫ్రిన్‌గా నటించటం ఎలా అనిపించింది?
రష్మిక: నా కెరీర్‌లో తొలిసారి ఇలాంటి వైవిధ్యభరిత పాత్రని పోషించా. ఈ వైలెంట్‌ పాత్ర నాకు సవాలు విసిరింది. దాన్ని స్వీకరించా. నటిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.

ఇలాంటి పాత్రల్లో ఇంకా నటిస్తారా?
రష్మిక: హీరోయిన్‌గానే కాకుండా సినిమాని నడిపించే ఆఫ్రిన్‌లాంటి పాత్రల్లో నటించేందుకు నేను సిద్ధమే. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో అలాంటి పాత్రల్లోనే నటిస్తున్నా. నన్ను కొత్తగా చూపించిన ‘సీతారామం’ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.
దర్శకుడు హను రాఘవపుడి గురించి చెప్తారా?
రష్మిక: హను.. సినిమాపై ప్యాషన్ ఉన్న దర్శకుడు. సినిమా కోసం చాలా కష్టపడతారాయన. ఆయనకి మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నా.

స్టార్‌గా కొనసాగుతూ ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో రిస్క్‌ ఉంటుందా?
రష్మిక: రిస్క్‌ ఉన్నా ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే అనుకుంటా. నటులెవరికైనా ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ఎంతో ముఖ్యం. ఇప్పుడిప్పుడే నా కంఫర్ట్‌ జోన్‌ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా.
హిందీలో మీరు నటించిన ఒక్క సినిమా విడుదలవకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా?
రష్మిక: హిందీలోనే కాదు తెలుగులోనూ నాకు ఇలానే జరిగింది. నా తొలి తెలుగు చిత్రం ‘ఛలో’ షూటింగ్‌ దశలో ఉండగానే ‘గీత గోవిందం’, ‘దేవదాస్’ చిత్రాల అవకాశాలు వచ్చాయి. అప్పుడప్పుడూ అలా అవుతూ ఉంటుంది. అదృష్టంతోపాటు కష్టాన్నీ నమ్ముతా.
మీ డ్రీమ్ రోల్స్ ?
రష్మిక: పీరియాడికల్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించాలనుంది. బయోపిక్‌ల్లోనూ, స్పోర్ట్స్‌ చిత్రాల్లోనూ కనిపించాలనుంది.

ఇదీ చూడండి: 'ఇది నాకు పునర్జన్మ.. ఆఖరి రక్తపుబొట్టు వరకు కష్టపడి పని చేస్తా'

Last Updated : Aug 9, 2022, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.